హాట్ షాట్స్ సృష్టికర్త రాజ్ కుంద్రానే.. ముందే ప్లాన్-బి రెడీ.. మాస్టర్ మైండ్ ఇతనే

హాట్ షాట్స్ సృష్టికర్త రాజ్ కుంద్రానే.. ముందే ప్లాన్-బి రెడీ.. మాస్టర్ మైండ్ ఇతనే

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ వీడియోలు తీస్తున్నారని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది ఏ ఒక్క రాత్రి జరిగింది కాదు. ఆరు నెలలుగా జరుగుతున్న తతంగం. 2020 అక్టోబర్ నెలలోనే హాట్ షాట్స్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ బ్యాన్ చేసింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే కంప్లయింట్స్ ఆధారంగా దీన్ని తొలగించింది. అప్పటి నుంచే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల కన్ను రాజ్ కుంద్రాపై పడింది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్ షాట్స్ యాప్ తొలగించిన వెంటనే.. తన టీంతో రాజ్ కుంద్రా చర్చించారు. అందులోనే కంటెంట్ మొత్తాన్ని మరో యాప్ లో అప్ లోడ్ చేసి.. దాన్ని విడుదల చేయాలని డిసైడ్ చేశారు. దానికి ప్లాన్ బి అని పేరు పెట్టారు. ప్లాన్ బిలో భాగంగా హాట్ షాట్స్ ప్లేస్ లో బాలీఫేమ్ అనే పేరుతో యాప్ తీసుకురావాలని నిర్ణయించారు.

హాట్ షాట్స్ లో ఉన్నంత బోల్డ్ కంటెంట్ కాకుండా ఆల్ట్ బాలాజీలో ఉన్నంత హాట్ కంటెంట్ ను మాత్రమే అప్ లోడ్ చేయటం మొదలుపెట్టారు. నగ్నత్వాన్ని తగ్గించి.. హాట్ షాట్స్ వీడియోలను ఎడిటింగ్ చేసి బాలీఫేమ్స్ పేరుతో కొత్త యాప్ తయారీకి సన్నాహాలు చేశాడు.

బాలీఫేమ్ యాప్ ను ఇండియాలో కాకుండా యూకేలో తయారు చేసి అక్కడి నుంచి అప్ లోడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు రెండు నెలల సమయం పడుతుందని.. అప్పటి వరకు హాట్ షాట్స్ యాప్ లోని బోల్డ్ కంటెంట్ ను డిలీట్ చేసి గూగుల్ ప్లే స్టోర్ కు మళ్లీ అప్పీల్ చేయాలని తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు.

అప్పటికే హాట్ షాట్స్ పై విమర్శలు, ఆరోపణలతోపాటు అడల్ట్ కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం నిఘా, సెన్సార్ ఉంచటంతో హాట్ షాట్స్ అప్పీల్ ను తిరస్కరించింది గూగుల్. దీంతో బాలీఫేమ్స్ లైన్ లోకి తీసుకొచ్చారు. హాట్ షాట్స్ వీడియోలను ట్రిమ్ చేసి.. ఎడిటింగ్ చేసి.. లైవ్ స్ట్రీమ్ ద్వారా మళ్లీ మార్కెట్ లోకి వచ్చారు రాజ్ కుంద్రా.

ఈ విషయం అంతా విచారణలో వెల్లడించారు. పోలీస్ నిఘా ఉందని తెలిసినా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారని తెలిసినా.. ప్రభుత్వం సెన్సార్ చేస్తుందని తెలిసినా.. ఇంగ్లాండ్ నుంచి దాన్ని ఆపరేట్ చేసే విధంగా ప్లాన్ బి అమలు చేశాడే కానీ.. బిజినెస్ మాత్రం ఆపలేదు రాజ్ కుంద్రా. ఇదే అతన్ని అరెస్ట్ వరకు తీసుకొచ్చింది. అదే విధంగా కొత్త నటీనటుల కోసం వేటలో భాగంగా.. కొందరిని బలవంతం చేయటం కూడా ఓ కారణం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు