స్పాట్ లో రూ.25 లక్షలు ఇస్తా.. పోలీసులకు రాజ్ కుంద్రా ఆఫర్

స్పాట్ లో రూ.25 లక్షలు ఇస్తా.. పోలీసులకు రాజ్ కుంద్రా ఆఫర్

హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ సమయంలో హైడ్రామా నడిచింది. పోర్న్ వీడియోల తయారీ వెనక రాజ్ కుంద్రా హస్తం ఉందని నిర్థారణ తర్వాత అరెస్ట్ చేయటానికి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులతో బేరం ఆడాడు. పోర్నోగ్రఫీ చట్టం కింద అరెస్ట్ చేయకుండా.. మరో కేసు పెట్టాలని.. అలా చేసినట్లయితే.. ఇప్పటికిప్పుడే 25 లక్షల రూపాయల క్యాష్ ఇస్తానంటూ ఆఫర్ చేశాడు.

25 లక్షల స్పాట్ క్యాష్ ఇస్తానన్న రాజ్ కుంద్రా ఆఫర్ తో షాక్ అయ్యారు క్రైం బ్రాంచ్ పోలీసులు. రాజ్ కుంద్రా అరెస్ట్ కు ముందే ఉన్నతాధికారుల దగ్గర చర్చ జరగటం, హైలెవల్ లో దీనిపై డిస్కషన్ చేసిన తర్వాతే అరెస్ట్ వరకు రావటంతో.. క్రైం బ్రాంచ్ పోలీసులు ససేమిరా అన్నారనే ప్రచారం జరుగుతుంది. సెలబ్రిటీ విషయంలో లంచానికి లొంగితే.. మీడియా బయటకు తీస్తుంది.. ఆ తర్వాత పెద్ద రచ్చ అవుతుంది.. ఉద్యోగాలకే ఎసరు వస్తుందన్న పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంట. మాకే లంచం ఇస్తావా అంటూ నాలుగో కంటితో చూసి.. బేడీలతో పట్టుకెళ్లారంట.

పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా వ్యవహారంపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఫీల్డ్ లోకి తన పీఏ వల్ల ఎంట్రీ అయినట్లు చెబుతున్నారంట. అతని ద్వారానే పోర్న్, సెమీపోర్న్ మార్కెటింగ్ తెలిసిందని.. అందులో డబ్బులు బాగా వస్తుండటంతో.. ఖర్చు తక్కువగా ఉండటంతో అంగీకరించినట్లు చెప్పారంట. ఇందులో ఎవర్నీ బలవంతం చేయలేదని.. అందరు అమ్మాయిలు తమ అంగీకారంతోనే వచ్చారని చెప్పుకొచ్చారంట. అలా వచ్చిన వాళ్లకు సిరీస్ కు ఇంతని రెమ్యునరేషన్ ఇచ్చినట్లు చెప్పాడు రాజ్ కుంద్ర.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు