‘పోలవరం’పై బురద జల్లడమే వాళ్ల పని..!

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను జెట్ స్పీడుతో ముందుకెళుతున్నాయి. లాక్డౌన్.. కరోనా టైంలోనూ పోలవరం పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగుతున్నాయి. దీనిని చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో(పచ్చమీడియా) పోలవరానికి అవినీతి మరలు అంటించేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా పోలవరం నిర్మాణంపై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఒక అబద్దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు.

-పోలవరంపై బురదజల్లడమే వాళ్ల పని..
ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పోలవరంలో తట్టెడు పనులు చేయలేదు సరికదా చేస్తున్న వాళ్లచూసి కుళ్లుకుంటున్నారు. కరోనా టైంలోనూ చకచక సాగిపోతున్న ‘పోలవరం’ నిర్మాణాన్ని చూసి ఓర్వలేక పచ్చమీడియాతో కలిసి ఊగిపోతున్నారు. చంద్రబాబుకు పోలవరం చూపించిన గ్రాఫిక్స్ ను సీఎం జగన్ నిజం చేస్తుండటంతో చంద్రబాబు కళ్లకింద భూమి కదులుతోంది. పోలవరం కంప్లీట్ అయితే ఇన తన పని అయిపోతుందని భావిస్తున్న చంద్రబాబు పచ్చమీడియాతో కలిసి కుట్రలు కుంతంత్రాలు చేస్తున్నారు.

-దొందుదొందే..
అవినీతి కేరాఫ్ అయిన చంద్రబాబుకు పచ్చమీడియా వంతపాడటం కొత్తమీకాదు. పోలవరంలో నాడు చంద్రబాబు గ్రాఫిక్స్ ను బాహుబలి రేంజులో చూపించిన పచ్చమీడియా నేడు కూడా ఆయన వంతేపాడుతోంది. కేంద్ర జలసంఘం సూచన మేరకు ప్రాజెక్టు రక్షణ చర్యల్లో భాగంగా జగన్ సర్కార్ అదనంగా రూ.683కోట్ల పనులు చేపట్టనుంది. వీటన్నింటిని జ్యూడిషియల్ అప్రూవల్ తో ఇటీవల టెండర్లు పిలిస్తే వాటిపై కూడా పచ్చమీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తుండటం శోచనీయంగా మారింది.

– పారదర్శకంగా పనులు..
పోలవరం ప్రాజెక్టును ఛాలెంజ్ గా తీసుకున్న సీఎం జగన్ ఖర్చుకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేస్తున్నారు. కరోనా టైంలో ఖజానాపై భారం పడుతున్నప్పటికీ ప్రాజెక్టు పనులను ఎక్కడా ఆపకుండా జెట్ స్పీడుతో పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు సంబంధించిన అన్ని వ్యయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ ఆడిట్ చేస్తూ నిస్పాక్షపతంగా..అవినీతికి తావులేకుండా పనులను చేస్తున్నారు.

– కేంద్ర జలం సంఘం సూచనలతో మార్పులు చేర్పులు..
గత ప్రభుత్వం పోలవరంలో చేసిన తప్పులను కేంద్ర జల సంఘం సూచన మేరకు జగన్ సర్కార్ ప్రాజెక్టులో కొన్ని మార్పులను చేర్పులను చేసింది. ఇందుకోసం రూ.683కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. వీటిలో భాగంగా స్పిల్ ఛానెల్ చివరన 12 మీటర్ల లోతు నుంచి 1354 మీటర్ల పొడవున కటాఫ్ వాల్ ను నిర్మించనున్నారు. దీనిని 83.17కోట్లతో నిర్మించనున్నారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పటిష్టత కోసం 211.12కోట్ల కొత్త టెండర్ ను కూడా పిలిచారు..

– గ్యాప్-1.. గ్యాప్-3 లలో డ్యాంల నిర్మాణం..
ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో పోలవరం హెడ్ వర్క్స్ పనులను గతంలోనే మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గ్యాప్-1లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించేలా అగ్రిమెంట్ లో ఉంది. ఐతే కేంద్రజలసంఘం నిపుణుల సూచనలకు అనుగుణంగా 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం భూమిలోపల నుండి ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించడంతో పాటు.. స్టోన్ కాలమ్స్.. డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ పనులకు సైతం 242.87 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. గ్యాప్-3లో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ లో కేవలం ఎర్త్ డ్యాం నిర్మించాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం 11.64 కోట్లతో టెండర్లు పిలిచారు. స్పిల్ వే కుడి,ఎడమ కొండలకు రక్షణ చర్యల కోసం 134.21కోట్లతో పనులకు టెండర్లను పిలిచారు.

– కేంద్ర జల సంఘం ఆమోదం తర్వాతే టెండర్లు..
పోలవరం ప్రాజెక్టు రక్షణ చర్యలకు కేంద్ర జలసంఘం అదనంగా కొన్ని పనులను సూచించింది. దీంతో ప్రాజెక్టు వ్యయం 683 కోట్లు పెరిగింది. వీటికోసం ఇటీవలే జ్యూడీషియల్ ప్రివ్యూ పూర్తి అయిన తరువాత టెండర్లు ఆహ్వానించారు. వీటితోపాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలను కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. దీనిని సాకుగా చూపుతూ పచ్చమీడియా జగన్ సర్కార్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తాదంటూ తప్పుడు కథనాలను పదేపదే ప్రసారం చేసింది. అయితే నిజానిజాలను తెలుసుకోకుండా పోలవరంపై విషం చిమ్ముతున్న పచ్చమీడియాపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు