రేవంత్ రెడ్డి సలహాదారుగా రవిప్రకాష్.. పీకే రోల్ పోషించనున్న ఆర్పీ

రేవంత్ రెడ్డి సలహాదారుగా రవిప్రకాష్.. పీకే రోల్ పోషించనున్న ఆర్పీ

రేవంత్ రెడ్డి సలహాదారుగా రవిప్రకాష్.. పీకే రోల్ పోషించనున్న ఆర్పీ

తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పార్టీ పటిష్టంపై దృష్టి పెట్టారు. సొంత టీం నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మీడియా సలహాదారుగా రవిప్రకాష్ ను నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సొంత న్యూస్ ఛానల్ లేదు. గతంలో సాక్షి ఉన్నా.. జగన్ బయటకు వెళ్లిపోవటంతో అది వ్యతిరేకం అయ్యింది. ఈలోటును భర్తీ చేయటానికి రవి ప్రకాష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ న్యూస్ ఛానల్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికిప్పుడు కొత్త న్యూస్ ఛానల్ పెట్టటం కష్టం.. టైం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లైసెన్స్ ఉన్న.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ న్యూస్ ఛానల్ తీసుకుని.. మూడు నెలల్లో భారీ రిక్రూట్ మెంట్ చేపట్టాలని నిర్ణయించారు రేవంత్ రెడ్డి టీం.

బాధ్యతల స్వీకరణ వేడుకలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పీకేలు అవసరం లేదు అన్నారు. పీకే అవసరం లేకపోయినా.. ఆ స్థాయిలో మీడియా సమన్వయం చేసుకోవటానికి.. పత్రికలు, టీవీ ఛానల్స్, సోషల్ మీడియాను ఒక్కటిగా నడిపించే వ్యక్తి అవసరం అయితే కచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీంలో.. మీడియా సలహాదారునిగానే కాకుండా పీకే రోల్ పోషించబోతున్నారు రవిప్రకాష్.

ఆర్పీ సలహాలు, సూచనల్లో భాగంగానే ఇటీవల ఈనాడు, జ్యోతి, టీవీ5 పత్రికాధిపతులను కలిసిన రేవంత్ రెడ్డి.. మద్దతు కోరారు. ఇదంతా ఆర్పీ స్ట్రాటజీగా స్పష్టమవుతోంది.

మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటం.. మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి యాత్రలు స్టార్ట్ చేయబోతున్నారనే వార్తల క్రమంలో.. సాధ్యమైనంత త్వరగా సొంత టీంతోపాటు.. మీడియాను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు