నిజాంపేట్ లో జరిగిన రియల్ స్టోరీ : కరోనాతో చస్తే డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు : వెటకారం ఆడిన కార్పోరేట్ హాస్పటల్

నిజాంపేట్ లో జరిగిన రియల్ స్టోరీ : కరోనాతో చస్తే డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు : వెటకారం ఆడిన కార్పోరేట్ హాస్పటల్

nizmapet road hospital

నీకు కరోనా వచ్చింది.. అది కూడా సీరియస్ గా ఉంది.. ఇంట్లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవటానికి కుదరదు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వండి.. కరోనా పేషెంట్ తో ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ ఇలా అన్నారు.

సార్.. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. రోజూ 50 వేల రూపాయలు అంటున్నారు.. ఇంకా పెరగొచ్చు అంటున్నారు.. వారం రోజులు అయినా ఉండాలి అంటున్నారు.. ఎంత లేదన్నా మీరు చెప్పినట్లు 4 నుంచి 5 లక్షల రూపాయలు అవుతుంది అని తెలుస్తుంది.. అంత డబ్బు నా దగ్గర లేదు.. నేను చిన్న ఉద్యోగిని.. నెలకు 40 వేల రూపాయల జీతం మాత్రమే.. అంత ఎలా భరించగలను సార్.. మీరే దయతలచి.. తగ్గించుకోండి సార్.. పుణ్యం కట్టుకోండి సార్.. డాక్టర్ తో కరోనా పేషెంట్ మాటలు..

చూడయ్యా.. నీకు వచ్చింది కరోనా.. అది కూడా సీరియస్ గా ఉంది.. చచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ పెట్టుకుంటావ్.. కట్టుకుని పోతావా ఏంటీ.. బతికి ఉంటే కదా.. ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచించేది.. ఎలాగోల తీసుకుని రా.. అంతకు తగ్గితే ట్రీట్ మెంట్ ఇవ్వలేం. వెంటనే అడ్వాన్స్ ఓ లక్ష రూపాయలు కట్టి.. కోవిడ్ గదిలో బెడ్ తీసుకోండి అంటూ డాక్టర్ చెప్పారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దందా.. దౌర్జన్యం ఎలా ఉందో ఈ ఒక్క ఘటన చాలు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోని దుస్థితి ఇది. చచ్చిన తర్వాత డబ్బులు కట్టకట్టుకుని వెళతావా ఏంటీ.. చచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ పెట్టుకుంటావ్ అంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి.. మానవత్వం అనేది చచ్చిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యాలు, డాక్టర్లు, నర్సులు ఏమైనా చచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు.. వాళ్లు మనుషులే కదా.. ఏం మానత్వంతో.. లాభం లేకుండా ట్రీట్ మెంట్ ఇవ్వలేరా సంక్షోభ సమయంలో.. ఏడాదిగా కరోనా ఉంది.. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి.. డబ్బులు ఉన్నోడో అయితే చిన్న ప్రైవేట్ ఆస్పత్రికి ఎందుకు వస్తాడు.. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా డాక్టర్లు.. ఆస్పత్రి యాజమాన్యాలు..

నిజమే కరోనాతో పేషెంట్ చచ్చిపోతే డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాడో వాడికి తెలుసు.. వాడికి ఉన్న ఆస్తి ఏంటో.. వాడి సంపాదన ఏంటో వాడికి తెలుసు.. మరి ప్రైవేట్ ఆస్పత్రులు దోచుకున్న డబ్బుతో.. ఏమైనా నోట్ల కట్టలపై తగలబెట్టుకుంటారా ఏంటీ.. అందర్నీ కట్టెలపైనే కదా తగలేసేది..

కొంచెం అయినా మానవత్వం.. మనుషులం అని ఆలోచించండి.. ఇలా చెబుతున్నాం అని.. మీరు మారతారని కాదు.. ఈ భయంతో అయినా జనంలో భయం వచ్చి.. జాగ్రత్తలు తీసుకుని.. కరోనాకు దూరంగా ఉంటారని.. మధ్య తరగతి, సామాన్యుల కోసం రాస్తున్న కన్నీటి కథ..

దేవుడు అన్ని లెక్కలు సెట్ చేస్తాడు.. మీ ఆస్పత్రుల లెక్క సైతం ఏదో ఒక రోజు సెట్ చేయక మానడు.. జనం చూస్తూ ఉండక మానరు.. పాపం పండాల్సిందే ఏదో ఒక రోజు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు