రాజీనామా చేసిన గాలి జనార్దన్ రెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. అక్రమ మైనింగ్ పాల్పడ్డారని సీబీఐ కేసులు నమోదు చేసింది. కాగా ఓఎంసీ కంపెనీ కేసులో విచారణ జరుగుతుంది. ఓఎంసీలో రెండో డైరెక్టర్ గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి గతంలో ఈ కేసులో డీఛార్జి పిటిషన్ దాఖలు చేశారు. జనార్దన్ రెడ్డి పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.

 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ ఓఎంసీ కంపెనీ డైరెక్టర్‌ పదవికి గాలి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. కంపెనీ లావాదేవీల గురించి ఆయనకు తెలియదన్నారు. బళ్లారి ఐరన్‌ ఓర్‌ సంస్థపై కూడా కేసు ఉన్నా సీబీఐ కేవలం ఓఎంసీ కేసులోనే దర్యాప్తు చేసిందన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోందని.. అయితే, సరిహద్దు వివాదమే తేలలేదని పేర్కొన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు