కాంగ్రెస్ రూపంలో టీడీపీ.. ఎస్సీ, ఎష్టీ, బీసీ వర్గాల కాంబినేషన్ కు రేవంత్ వ్యూహం

కాంగ్రెస్ రూపంలో టీడీపీ.. ఎస్సీ, ఎష్టీ, బీసీ వర్గాల కాంబినేషన్ కు రేవంత్ వ్యూహం

కాంగ్రెస్ రూపంలో టీడీపీ.. ఎస్సీ, ఎష్టీ, బీసీ వర్గాల కాంబినేషన్ కు రేవంత్ వ్యూహం

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది.. కారణం ఓటుకు నోటు కేసు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి చంద్రబాబు ఏపీకి వెళ్లిపోయారు. పదేళ్ల రాజధాని హక్కులను వదిలేశారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు.

2021, జూలై 7వ తేదీ బాధ్యతలు స్వీకరించబోతున్న రేవంత్ రెడ్డి.. అంతకు ముందే తన వైఖరి ఏంటో స్పష్టం చేసేశారు. టీడీపీ ఆత్మ బంధువులుగా ఉన్న.. ఎల్లో మీడియా ముద్రలో ఉన్న టీవీ ఛానల్ అధినేతలను కలిశారు. ఈ భేటీలో ఏపీలో టీడీపీ పరిస్థితినే కాదు.. నారా లోకేష్ సామర్థ్యంపైనా చర్చ జరగటం.. ఆ వీడియో బయటకు రావటం తెలిసిందే.

ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ రూపంలో టీడీపీ దూసుకొస్తుందని.. కాంగ్రెస్ ఆత్మను చంపి.. టీడీపీకి బలాన్ని ఇస్తున్నామా.. కాంగ్రెస్ పార్టీని పైకి లేపుతున్నామా అనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు. పక్కా టీడీపీ ఛానల్స్ గా ఉన్న అధినేతలను స్వయంగా కలవటం వెనక.. టీడీపీనే.. కాంగ్రెస్ అయ్యిందని.. కాంగ్రెస్ పార్టీ రూపంలో టీడీపీ దూసుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ వారే చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ – టీడీపీ ప్రత్యర్థులు అయినా.. తెలంగాణ ఇక నుంచి రెండూ ఒకటే అనే సంకేతాలను రేవంత్ రెడ్డి.. బాధ్యతల స్వీకరణకు ముందే పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ఇక నుంచి కాంగ్రెస్ – టీడీపీ ఒక్కటిగా ముందుకు వెళుతుందని.. మీడియా సపోర్ట్ ఆ విధంగా దొరుకుతుందని కాంగ్రెస్ కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణలో టీడీపీకి బీసీ వర్గాలు బలమైన పునాదిగా ఉన్నారు. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి సహజంగా ఉన్న ఎస్సీ, ఎస్టీను.. టీడీపీకి అనుకూలంగా ఉండే బీసీలను కలుపుకుని ముందుకు వెళ్లాలనే వ్యూహం రచించారు.

అనుకున్నట్లుగానే టీడీపీ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వటం ఓపెన్ గానే కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ తర్వాత మరింత జోరు పెంచాలని డిసైడ్ అయ్యింది. ఓ రకంగా కాంగ్రెస్ రూపంలో టీడీపీ దూసుకొస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు