నిన్నటి వరకు తిట్టాడు.. ఇప్పుడు స్టూడియోకెళ్లి ఇంటర్వ్యూ.. రేవంత్ రెడ్డి వైఖరిపై అభిమానులు షాక్

కీలకమైన సమయంలో శత్రువులకు మిత్రులుగా మారారా అనే డౌట్ వస్తుంది. ఇన్నాళ్లు తప్పుగా కనిపించినవి.. ఇప్పుడు రైట్ అయ్యాయా.. ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది.. ఇదీ రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్న డౌట్స్....

revanth reddy interview in 10tv telugu
revanth reddy interview in 10tv telugu

తెలంగాణ పీసీసీ రేస్ లో ముందు వరసలో ఉన్న రేవంత్ రెడ్డి.. సడెన్ గా తన వైఖరి మార్చుకున్నాడు. శత్రువులను మిత్రులు చేసుకున్నారా.. శత్రువులే దిగి వచ్చారో తెలియదు కానీ.. నిన్నటి వరకు 10 టీవీ, టీవీ9 ఛానల్స్ పై దుమ్మెత్తిపోసి ఇప్పుడు 10 టీవీకి స్టూడియోకు వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చాడు. పంగ నామాలు పెట్టుకున్న సన్నాసోడు అంటూ 10 టీవీ యజమాని రామేశ్వరరావును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టటమే కాకుండా.. కేసులు కూడా వేశాడు. బద్ద శత్రువు అన్నట్లు జనంలోకి తీసుకెళ్లాడు రేవంత్ రెడ్డి.

ఇప్పుడు ఆ ఛానళ్లకు పిలవగానే వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అవసరం ఎవరికి ఉందో.. ఎవరు దిగివచ్చారో తెలియదు కానీ.. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయ్యారు. ఇంత అకస్మాత్తుగా శత్రువు మిత్రుడు ఎలా అయ్యాడు.. తిట్టిన ఛానల్ లో కూర్చుని ఎలా ఇంటర్వ్యూ ఇచ్చాడు అనేది జీర్ణించుకోలేకుండా ఉన్నారు. రాత్రికి రాత్రి ఏం మారింది.. రామేశ్వరరావులో ఏం నచ్చింది.. సన్నాసి ఛానల్ ఎలా మంచిది అయ్యిందో రేవంత్ రెడ్డిగారే చెప్పాలి.

ఇక్కడ మాత్రం కచ్చితంగా బకరా అయ్యింది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులే. ఎందుకంటే ఇన్నాళ్లు 10 టీవీ, టీవీ9 యజమాని రామేశ్వరరావుపై.. ఆయన ఛానల్స్ పై రేవంత్ రెడ్డి దొంగ, లఫంగి, దగుల్భాచీ అని ముద్ర వేసి అభిమానులకు చెప్పింది ఆయనే.. ఇప్పుడు ఆయనే స్టూడియోలకు వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే కార్యకర్తలు, అభిమానులకు ఏం చెప్పదలచుకున్నారు అనేది అర్థం కావటం లేదు.

పీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి వైఖరిపై ఆ పార్టీ నేతలే ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారు. సరిగ్గా ఇది నిజం అన్నట్లు.. కీలకమైన సమయంలో శత్రువులకు మిత్రులుగా మారారా అనే డౌట్ వస్తుంది. ఇన్నాళ్లు తప్పుగా కనిపించినవి.. ఇప్పుడు రైట్ అయ్యాయా.. ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది.. ఇదీ రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్న డౌట్స్..

ఏముందన్నా.. అంతా అయిపాయే.. ఇదే ఇప్పుడు రేవంత్ వర్గంలోని వారి నిర్వేదపు మాట.. అభిమానులు ఎర్రిపప్పలేనా…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు