జీహెచ్ఎంసీ కాంగ్రెస్ బాధ్యత రేవంత్ రెడ్డికి – 15 డివిజన్లలో గెలుపు లక్ష్యం

టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొని ధీటుగా స్థానాలు రాబట్టాలి అంటే ఎంపీ రేవంత్ రెడ్డి బెటర్ అని

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏ క్షణమైన నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ బూతులు రెడీ చేసింది. ఇక నోటిఫికేషన్ విడుదల చేస్తే.. నామినేషన్ల స్వీకరణకు అధికారులు సైతం సిద్ధం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. మిగతా మిగతా పార్టీల సంగతి ఏంటీ అంటే..

కాంగ్రెస్ పార్టీలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది. కొన్ని రోజులుగా సిటీలో 10 వేల ఆర్థిక సాయం అవకతవకలపై ఆందోళనలు, నిరసనలు చేస్తోంది. బస్తీల్లో ప్రజలకు అండగా నిలుస్తుంది

మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. సిటీ పరిధిలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండటమే ఇందుకు కారణం

రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్నికల.. కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే కనీసం 15 డివిజన్లలో గెలుపు ఖాయం అని భావిస్తున్నారు.

మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఆయనకు మద్దతు బాగుంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతోపాటు టీడీపీ అనుకూలమైన వారు ఆయనకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది

టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొని ధీటుగా స్థానాలు రాబట్టాలి అంటే ఎంపీ రేవంత్ రెడ్డి బెటర్ అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ కూడా డిసైడ్ అయ్యారంట.

పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తే అసమ్మతులు అన్ని తొలగి.. పార్టీకి బలం వస్తుందని నిర్ణయించారు నేతలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు