కాంగ్రెస్ పార్టీలోకి వేల కోట్ల డబ్బున్న పారిశ్రామికవేత్త.. రేవంత్ భేటీతో క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలోకి వేల కోట్ల డబ్బున్న పారిశ్రామికవేత్త.. రేవంత్ భేటీతో క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలోకి వేల కోట్ల డబ్బున్న పారిశ్రామికవేత్త.. రేవంత్ భేటీతో క్లారిటీ

పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి.. అందులో భాగంగా ఒక్కొక్కరినీ కలుస్తూ వస్తున్నారు. డీఎస్ కుమారుడు సంజయ్ ను పార్టీలోకి తీసుకురావటంతోపాటు.. నిజామాబాద్ జిల్లాలో గతంలో యాక్టివ్ గా పని చేసిన వాళ్లను తిరిగి తీసుకురావటం సక్సెస్ అయ్యారు.

ఇదే ఊపులో తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల అధిపతి అయిన అపోల్ ఆస్పత్రుల యజమాని, మాజీ టీఆర్ఎస్ ఎంపీ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డితో హైదరాబాద్ లో జూలై 13వ తేదీ సాయంత్రం భేటీ అయ్యారు. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ఎంపీగా చేసిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ రాజకీయాలను తట్టుకోలేక రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు వచ్చినా.. సైలెంట్ గానే ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన కొండా విశ్వేశ్వరరెడ్డిని మళ్లీ తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల ఆయన తల్లి చనిపోయింది కూడా. ఈ రెండు అంశాలు కలిసి వస్తాయన్నట్లు.. వీరి భేటీ జరిగింది.

కొండా విశ్వేశ్వరరెడ్డి సామాన్యమైన వ్యక్తి కాదు. వేల కోట్ల రూపాయలకు అధిపతి. సొంత నిధులతోనే చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశారు. స్వతహాగా మంచి వ్యక్తి అన్న పేరున్న విశ్వేశ్వరరెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం ద్వారా.. హైదరాబాద్, చేవెళ్ల పరిధిలో మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఇక విశ్వేశ్వరరెడ్డి ద్వారా పార్టీ ఫండ్ కు ఇబ్బంది ఉండదు. అధికారికంగానే వెయ్యి కోట్ల ఆస్తి ఆయనది.. ఇక అపోలో ఆస్పత్రి యజమాని అంటే మాటలా చెప్పండి.. అన్ని రకాలుగా విశ్వేశ్వరరెడ్డి పార్టీకి ఉపయోగం అని భావించిన రేవంత్ రెడ్డి.. ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకోవటంతోపాటు.. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అతనితో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు