కీలకమైన సమయంలో సంయమనం కోల్పోతున్న రేవంత్ రెడ్డి అభిమానులు

కీలకమైన సమయంలో సంయమనం కోల్పోతున్న రేవంత్ రెడ్డి అభిమానులు.. ఈ రెండు రోజుల గొడవను హైకమాండ్ దగ్గరకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ను మైనస్ గా చూపించే అవకాశం ఉండటమే కాదు.. జరిగే వాస్తవం కూడా ఇదే.

Revanth Reddy social media self goal in Perni nani issue
Revanth Reddy social media self goal in Perni nani issue

పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని.. రెండు, మూడు రోజుల్లో అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటిస్తారు అనే వార్తలు వస్తున్న సమయంలో.. ఎంపీ రేవంత్ అభిమానులు, అనుచరులు సంయమనం కోల్పోవటం విశేషం. దీనికి కారణం లేకపోలేదు.. ఏపీ మంత్రి పేర్ని నాని.. ఓటు నోటు కేసుపై మాట్లాడుతూ.. 50 లక్షల రూపాయలు ఇస్తూ అడ్డగంగా దొరికిపోయాడు అంటూ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ను పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబును టార్గెట్ చేసినా.. అందులో క్యారెక్టర్ రేవంత్ రెడ్డి కావటంతో.. రేవంత్ అనుచరులు పేర్ని నానిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తిట్ల పురాణం అందుకున్నారు.

పేర్నినాని వ్యాఖ్యలు చంద్రబాబును టార్గెట్ చేసినా.. కేసును ప్రస్తావించటంపై అభిమానులు స్పందించటం కామన్ అయినా.. ఇది కరెక్ట్ టైం కాదు. పేర్ని నాని ఏమన్నారో అనే విషయాన్ని.. రేవంత్ అనుచరులు టార్గెట్ చేసిన తర్వాత వెతికి మరీ చూశారు నెటిజన్లు. ఇక్కడ రేవంత్ వర్గం సక్సెస్ అయినా.. ఓటు నోటు కేసు నిజం కాదా అని.. ఆయన అన్నదాంట్లో తప్పేముందీ అని నెటిజన్ల నుంచి రియాక్షన్ రావటం విశేషం.

పేర్నినాని దమ్ముంటే కొడంగల్ రా.. ఇసుక మాఫియా, వయాగ్రా అంటూ చాలా చాలా కామెంట్లు చేశారు.. అయితే పేర్ని నాని కేవలం మంత్రి మాత్రమే.. తెలంగాణ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాడు.. అసలు పట్టించుకోరు.. అప్పుడు – ఇప్పుడు.. రాబోయే రోజుల్లో ఆయనకు తెలంగాణ రాజకీయాలతో, నేతలతో సంబంధాలు తక్కువ. దీని వల్ల పేర్ని నానికి వచ్చేది.. పోయేది ఏమీ లేదు.

రేవంత్ రెడ్డి అనుచరులు అత్యుత్సాహం రేవంత్ రెడ్డికే ముప్పు తెచ్చేలా ఉంది. పేర్ని నానిని గెలికే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్ చేయటంతోపాటు ఓటు నోటు కేసు నిజం కాదా.. 50 లక్షలు ఇస్తూ దొరికింది నిజం కాదా.. అంటూ పీసీసీ రేసులోని మిగతా వ్యక్తులు.. ఈ రెండు రోజుల గొడవను హైకమాండ్ దగ్గరకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ను మైనస్ గా చూపించే అవకాశం ఉండటమే కాదు.. జరిగే వాస్తవం కూడా ఇదే. కోమటిరెడ్డికి లేదా ఇతర ప్రత్యర్థులకు ఇది ప్లస్ పాయింట్ కాకుండా పోతుందా ఏంటీ అని నెటిజన్లు భావిస్తున్నారు.

సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమొచ్చినట్లు రాసేస్తే రేవంత్ అన్నకే కదా నష్టం.. కీలకమైన సమయంలో సంయమనం పాటించాల్సిన రేవంత్ రెడ్డి అభిమానులు, అతని సోషల్ మీడియా అనవసరంగా ఓటుకు నోటు కేసును హైలెట్ చేసుకోవటమే అవుతుంది.

పేర్నినానితో పోల్చితే రేవంత్ రెడ్డి ఓ పార్టీకి అధ్యక్షుడు కావొచ్చు.. పేర్ని నాని అయితే సీఎం కాలేదు.. రేవంత్ కు సీఎం అయ్యే అవకాశం ఉందని అతని అభిమానులు అంటున్నప్పుడు.. ఇంత చిన్న దానికే.. ఇప్పుడే ఇలా ఉంటే.. అధ్యక్షుడు అయిన తర్వాత ఇంత కంటే ఎక్కువ అంటారు.. అప్పుడు అందరిమీద ఇలాగే మీద పడతారా.. సంయమనం ఉండాలి.

ఇష్యూలో పేర్నినాని అన్న మాటల కంటే.. రేవంత్ అనుచరుల కౌంటర్ ద్వారా నాని ఏమన్నారో అనేది వెతుక్కునే పరిస్థితికి తీసుకురావటం మైనస్ గా భావించొచ్చు.. ఎందుకంటే ఓటుకు నోటు కేసు కోర్టులో ఉన్నది.. జైలుకు వెళ్లింది నిజం కాబట్టి.. కొన్ని సమయాల్లో పట్టుకోవటం కంటే.. పట్టించుకోక పోవటమే బెటర్.. ముఖ్యంగా సోషల్ మీడియాలో…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు