వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేనున్నాను కదా.. సీఎంతో నేతల భేటీపై రేవంత్ రెడ్డి అసహనం

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేనున్నాను కదా.. సీఎంతో నేతల భేటీపై రేవంత్ రెడ్డి అసహనం

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేనున్నాను కదా.. సీఎంతో నేతల భేటీపై రేవంత్ రెడ్డి అసహనం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతే కాదు.. రాబోయే పీసీసీ చీఫ్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి టైంలో.. ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ తో భేటీ కావటాన్ని కొందరు కాంగ్రెస్ నేతలకు రుచించటం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను.. పార్టీ వ్యవహారాల్లో.. పార్టీ ఎజెండా.. వ్యూహాల్లో భాగస్వామ్యంగా ఉన్నాను.. అలాంటిది నాకు కనీస సమాచారం లేకుండా సీఎం కేసీఆర్ తో ఎలా భేటీ అవుతారంటూ రుసరుసలాడుతున్నారంట రేవంత్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఏం లాభం అనే అసహాయతను వ్యక్తం చేశారంట రేవంత్ రెడ్డి.

దళిత బిడ్డ మరియమ్మకు న్యాయం కోసం సీఎం కేసీఆర్ ప్రగతిభగన్ గడప తొక్కాల్సిన అవసరం ఏంటని.. ఉద్యమం, పోరాటం, ధర్నాలు, ర్యాలీలు చేస్తే ఇంకా మంచి పేరు వచ్చేదన్నారంట. అలా కాకుండా వినతిపత్రం ఇవ్వటం ద్వారా ఏం ప్రయోజనం అంటున్నారంట రేవంత్ రెడ్డి. కనీసం కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం చేసి ఉంటే ప్రజల్లో ఇంకా బాగా మైలేజ్ వచ్చేదని అంటున్నారంట.

ఏడేళ్లుగా ఒక్క అఖిలపక్షం మీటింగ్ పెట్టని సీఎం కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు పిలిచి అపాయింట్ మెంట్ ఇచ్చారని.. దీనికి కారణం అందరికీ తెలిసిందే అంటున్నారు. ప్రభుత్వంపై పోరాటం, ఉద్యమం చేయాల్సిన అంశాన్ని సీఎం కేసీఆర్ గడపలోకి నెట్టామని.. వినతిపత్రంపై చర్యలు తీసుకున్నాం అనే పేరు కంటే.. సీఎం కేసీఆర్ ప్రకటించిన 30 లక్షల ప్యాకేజీ ఎక్కువ హైలెట్ అయ్యింది అంటున్నారంట.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు