10 నిమిషాల బిట్.. 15 నిమిషాల్లో ఆరున్నర లక్షల సంపాదన.. రాజ్ కుంద్రా బిజినెస్ ఐడియా

10 నిమిషాల బిట్.. 15 నిమిషాల్లో ఆరున్నర లక్షల సంపాదన.. రాజ్ కుంద్రా బిజినెస్ ఐడియా

10 నిమిషాల బిట్.. 15 నిమిషాల్లో ఆరున్నర లక్షల సంపాదన.. రాజ్ కుంద్రా బిజినెస్ ఐడియా

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బిజినెస్ ఐడియాకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అమెరికా, ఇంగ్లాండ్ లో లీగల్ అయినా.. ఇండియా ఇల్లీగల్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఇండియన్ పోర్న్ ఇండస్ట్రీని ఏలేసేవాడు. అతని ప్లానింగ్, టైమింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా చెబుతున్న విషయాలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి.

పోర్న్, సెమీపోర్న్ వీడియోలను తీసిన తర్వాత వాటిని డిజిటల్ మీడియాలో మార్కెటింగ్ చేసే విధానంలో.. రాజ్ కుంద్రా ఆలోచన చాలా అడ్వాన్స్ గా ఉంది. జస్ట్ 10 నిమిషాల రొమాంటిక్ .. ఇట్స్ సెమీ పోర్న్ లేదా అంతకు మించిన రొమాన్స్ ఉంటే ఓ బిట్ ను.. తన యాప్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ ద్వారానే డబ్బులు రాబట్టుకునేవాడు.

2020 అక్టోబర్ నెలలో ఓ 10 నిమిషాల బిట్ ను ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేయగా.. 15 నిమిషాల్లో లక్షా 85 వేల రూపాయలు వచ్చాయి. ఆ 10 నిమిషాల బిట్ ను అమ్మకానికి పెడితే వెంటనే 4 లక్షల 25 వేలకు అమ్ముడుపోయింది. దీన్ని ఓ అంతర్జాతీయ సంస్థ ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఆ వీడియో స్ట్రీమింగ్ నుంచి డిలీట్ అయ్యింది. అంటే 10 నిమిషాల బిట్.. 15 నిమిషాల్లో ఆరున్నర లక్షలు సంపాదించి పెట్టింది. దీన్ని తీయటానికి ఎంత భారీ బడ్జెట్ అయినా 2 లక్షలకు మించి ఉండదు. అది కూడా కాస్ట్లీ యాక్టర్ అయితేనే.. లేకపోతే 50 వేలల్లో తీసి పారేసి ఉంటారు..

క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జస్ట్ ఇది ఒక్క బిట్ మాత్రమే.. ఇలాంటి బిట్స్ ఎన్ని వందలు, వేలు అమ్మి ఉంటారు.. డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని రాజ్ కుంద్రా వేసిన మాస్టర్ ప్లాన్ అల్లాటప్పాగా లేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు