మారుతీరావు హీరో అయితే.. విలన్ ఎవరు : మర్డర్ టైటిల్ మరోలా ఉంటే బాగుండేది : మూవీ రివ్యూ

మారుతీరావు హీరో అయితే.. విలన్ ఎవరు : మర్డర్ టైటిల్ మరోలా ఉంటే బాగుండేది : మూవీ రివ్యూ...మర్డర్ తర్వాత ప్రవీణ్ అత్తమామల నిజ స్వరూపం తెలుసుకుని సాహితి తల్లి దగ్గరకు వచ్చేస్తుంది అనే పాయింట్ దగ్గర

ఎవరు అవునన్నా.. కాదన్నా.. రాంగోపాల్ వర్మ తీసిన మర్డర్ సినిమా అమృత – ప్రణయ్ లవ్ స్టోరీ అని అందరికీ తెలిసిందే.. కాకపోతే పేరడీగా పేర్లు మార్చి.. ఒక కోణం నుంచి తీసిన సినిమానే మర్డర్ మూవీ. అమృత ప్రణయ్ మూవీ కాదని వర్మ హైకోర్టు నుంచి అధికారింగా అందర్నీ నమ్మించొచ్చు కానీ.. ఈ ఘటనకు ముందు ఇలాంటి సినిమా తీయలేదు కదా.. ఇప్పుడు ఇలాంటి పాయింట్ తో సినిమా తీశాడు అంటే దానికి ప్రేరణ మాత్రం వీరి లవ్ స్టోరీతోపాటు మారుతీరావు ఆత్మహత్య అని అందరికీ తెలిసిందే. మర్డర్ మూవీ ఆన్ లైన్ విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉంది అంటే..

కథ విషయానికి వస్తే.. స‌మాజంలో బాగా డబ్బుతోపాటు పేరు, ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మాధవరావు. ఒకే కూతురు సాహితి అంటే ప్రాణం.. కూతురు పుట్టిన తర్వాతే కలిసి వచ్చిందని విశ్వసిస్తూ.. ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తాడు. సాహితి త‌న కాలేజ్ మేట్ ప్ర‌వీణ్‌ని ప్రేమిస్తుంది. తండ్రి మాధ‌వ‌రావుకి చెబితే.. ప్ర‌వీణ్ గురించి ఎంక్వయిరీ చేయిస్తాడు.. ప్ర‌వీణ్‌ మాత్రం సాహితిని కంటే.. త‌న డ‌బ్బు, హోదా కోస‌మే ట్రాప్ చేశాడని తెలుస్తుంది. ఆ విష‌యం సాహితికి చెప్పినా వినిపించుకోకపోగా.. ఎవరికీ తెలియకుండా ప్ర‌వీణ్‌ ను పెళ్లి చేసుకుని వస్తుంది.

దీన్ని అంగీకరించని మాధవరావు కూతురి జ్ణాపకాలతో మనోవేదన పడతాడు. అప్పుడే అనుకుంటాడు.. ప్రవీణ్ ను చంపేస్తే తన కూతురు తన దగ్గరకు వస్తుంది అని.. మరి అనుకున్నట్లు హత్య చేయించాడా.. చేయలేదా.. ఏం జరిగింది అనేదే సినిమా కథ

నటీనటుల నటన చూస్తే.. కూతురు లేచిపోతే త‌ల్లిదండ్రులు ప‌డే మనోవేదన, సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయనే సెంటిమెంట్ ను బాగా చూపించారు. ఎమోషన్స్ ను ఎలివేట్ చేయటంలో నటీనటులు బాగా నటించారు. చ‌క్క‌గా చూపించారు. మొండి ప‌ట్టుద‌ల ఉన్న కూతురు సాహితి తన మేరకు నటించింది.

డైరెక్ట‌ర్ ఆనంద్ చంద్ర సింగిల్ పాయింట్ గా సినిమాను తెరకెక్కించటం వల్ల.. చాలా సందర్భాల్లో సినిమాను సాగదీయాల్సి వచ్చింది. దీంతో సీరియల్ చూస్తున్నామా… సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తోంది ప్రేక్షకులకు.

మర్డర్ అనే టైటిల్ కంటే ఓ తండ్రి కథ.. కూతురిపై ప్రేమ కథ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది ప్రేక్షకులకు. ఓ తొందరపాటు నిర్ణయం కుటుంబాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తుంది అనేది చూపించటంతోపాటు.. కూతురిపై వల్లమాలిన ప్రేమ పెంచుకుంటే తండ్రి ఎంత బాధపడతాడు అనేదే సినిమా.

మర్డర్ తర్వాత ప్రవీణ్ అత్తమామల నిజ స్వరూపం తెలుసుకుని సాహితి తల్లి దగ్గరకు వచ్చేస్తుంది అనే పాయింట్ దగ్గర కథను ముగించేశాడు రాంగోపాల్ వర్మ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు