ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తొలగింపు.. మంత్రి పదవికి రూట్ క్లియరా లేక సైడ్ చేస్తున్నారా?

ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తొలగింపు.. మంత్రి పదవికి రూట్ క్లియరా లేక సైడ్ చేస్తున్నారా?

ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తొలగింపు.. మంత్రి పదవికి రూట్ క్లియరా లేక సైడ్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్.. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా ఉన్న నగిరి ఎమ్మెల్యేను ఆ పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం. ఆ స్థానంలో కొత్తగా మెట్టు గోవిందరెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వకూడదన్న నిబంధనను స్వయంగా విధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఆ మేరకు ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా తొలగించింది.

మొదటి విడతలో మంత్రి పదవి ఆశించి భంగపడిన రోజాను సంతృప్తి పరచటానికి అప్పట్లో ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదా ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పదవి తొలగించటం ద్వారా మళ్లీ అలక వహించరా ఏంటీ అనే డౌట్ రావొచ్చు. దీనికి కారణం లేకపోలేదు. రాబోయే మంత్రి వర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తు్న్నాయి.

మంత్రి పదవిలోకి వెళ్లిన తర్వాత ఎటూ ఆ పదవి ఖాళీ అవుతుంది. మంత్రి వర్గ విస్తరణకు ఇంకా కేవలం మూడు నెలలు మాత్రమే టైం ఉంది. అప్పుడు కొత్తగా నియమించటం ఎందుకు అని పార్టీ.. ముందుగానే ఆ పదవి నుంచి రోజాను తొలగించి.. మెట్టు గోవిందరెడ్డిని నియమించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని రోజాకు ముందుగా హామీ ఇచ్చినట్లు సమాచారం. రోజా అంగీకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజాకు సమాచారం లేకుండా ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పించారని.. పార్టీ కావాలనే పక్కన పెడుతుందని కొందరు అంటున్నారు. మంత్రి పదవి ఇవ్వటానికి కాదు.. సైడ్ చేయటానికే అనే ఓ వర్గం మీడియా జోరుగా ప్రచారం చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఓ వర్గం మీడియాలో రోజాను పక్కనపెడుతున్నారు అనే వార్తలు వచ్చాయి. అందుకు కొనసాగింపుగానే ఇప్పుడు తొలగించాలని చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు