ఈ సౌత్ ఇండియా పాటను 100 కోట్ల మంది చూశారు.. మరి మీరు

ఇండియా నుంచి 100 కోట్ల వ్యూస్ సాధించిన పాటల్లో ఇది 15వది

ఒకే ఒక్క పాట.. యూట్యూబ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 100 కోట్ల మంది చూసి సంచలనంగా క్రియేట్ చేసింది. అది కూడా సౌత్ ఇండియా.. తమిళనాడు కోలీవుడ్ కు చెందినది కావటం విశేషం.
మారి 2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఉంది కదా.. అదే ఇప్పుడు 100 కోట్ల వ్యూస్ తో సంచలనంగా నిలిచింది.

ఈ సినిమాలో ధనుష్ హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది
2019, జనవరి 2వ తేదీన వీడియో పాట విడుదల అయ్యింది. యువన్ శంకర రాజా సంగీతం అందించాడు
కోలవరీ పాట వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయిన రోజునే.. రౌడీ బేబీ సాంగ్ 100 కోట్ల వ్యూస్ రావటం యాదృశ్చికం.

వన్ బిలియన్ వ్యూస్ క్లబ్ లో జాయిన్ అయిన మొట్టమొదటి సౌత్ ఇండియా పాట ఇదే కావటం మరో విశేషం.
ఇండియా నుంచి 100 కోట్ల వ్యూస్ సాధించిన పాటల్లో ఇది 15వది మాత్రమే.
ఎఫ్ఎం రేడియోలు, కాలేజీ ఈవెంట్స్, ఫంక్షన్స్, జాతరలు, పెళ్లిళ్లు.. ఇలా కార్యక్రమం ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ధనుష్ – సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా కుదిరింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు