లోన్ యాప్స్.. 6 నెలల్లో రూ.21 వేల కోట్ల టర్నోవర్.. చైనా కుట్ర ఉందా

తెరవెనక ఏదో జరిగిందని.. లోన్ యాప్స్ ద్వారా దేశంలోని నల్ల ధనం విదేశాలకు తరలి వెళ్లిందా అనే అనుమానాలు....

Rs.21K Crores transactions by loan apps in india
Rs.21K Crores transactions by loan apps in india

దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు.. ఇందులో చైనాకు చెందిన లాంబో అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్రానికి సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సమాచారం ఆధారంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో.. చైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న లాంబోను అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

గత ఆరు నెలల కాలంలోనే.. 4 కంపెనీలు సృష్టించి.. వాటి కింద 150 లోన్ యాప్స్ ద్వారా 21 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్లు లావాదేవీలు జరపటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లోన్ యాప్స్ ద్వారా దేశంలోని డబ్బు విదేశాలకు తరలి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు.

సమక్ర మార్గంలోనే వ్యాపారం చేసి ఉంటే లాంబో ఎందుకు పారిపోవటానికి ప్రయత్నిస్తాడు అనే వాదన ఉంది. తెరవెనక ఏదో జరిగిందని.. లోన్ యాప్స్ ద్వారా దేశంలోని నల్ల ధనం విదేశాలకు తరలి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీని వెనక చైనా కుట్ర ఏమైనా ఉందా అనేది విచారణ చేయటానికి కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఈడీ, ఇన్ కంట్యాక్స్ శాఖలు ఈ లావాదేవీలపై లాంబోను విచారించనున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు