ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్

ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆరుగురు వైద్యుల

Sachin Tendulkar hospitalised six days after testing positive for Covid-19
Sachin Tendulkar hospitalised six days after testing positive for Covid-19

క్రికెట్ లెజండ్.. భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. 2021, ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం.. మార్చి 27వ తేదీ కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. అప్పటి నుంచి హోం ఐసోలేషన్ లో ఉన్న సచిన్ టెండూల్కర్.. గురువారం ఆస్పత్రిలో జాయిన్ కావటం కలకలం రేపుతోంది.

ఐదు రోజులు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సచిన్ టెండూల్కర్ కు.. ఇన్ఫెక్షన్ తగ్గకపోవటంతో ఏప్రిల్ 2వ తేదీన ఆస్పత్రికి చేరారు. ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆరుగురు వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తానని సచిన్ ప్రకటించారు.

సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే.. క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. మాస్టర్ బ్లాస్టర్ ఆరోగ్యంగా ఇంటికి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, క్రికెటర్లు ఆకాంక్షించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు