ధూళిపాళ్ల నరేంద్ర చేసిన అవినీతి ఏంటీ.. ఎందుకు అరెస్ట్ చేశారు.. సంఘం డెయిరీ ప్రభుత్వానికిది అయితే.. 

ధూళిపాళ్ల నరేంద్ర చేసిన అవినీతి ఏంటీ.. ఎందుకు అరెస్ట్ చేశారు.. సంఘం డెయిరీ ప్రభుత్వానికిది అయితే.. 

sangam dairy chairman TDP Leader dhulipalla narendra arrested
sangam dairy chairman TDP Leader dhulipalla narendra arrested

ధూళిపాళ్ల నరేంద్ర చేసిన అవినీతి ఏంటీ.. ఎందుకు అరెస్ట్ చేశారు.. సంఘం డెయిరీ ప్రభుత్వానికిది అయితే..

టీడీపీ సీనియర్ నేత, తెనాలిలోని సంఘం డెయిరీకి 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఏప్రిల్ 23వ తేదీ శుక్రవారం ఉదయం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పొన్నూరు మండలం చింతలపూడిలోని సొంతింట్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రతిఘటన లేకుండా.. చాలా ప్రశాంతంగా లొంగిపోయారు ధూళిపాళ్ల నరేంద్ర.

ధూళిపాళ్ల నరేంద్రలోపై ఏసీబీ కేసు ఉంది. 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయ్యింది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర భార్యకు కూడా నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ధూళిపాళ్ల నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు ఉందని ఏసీబీ స్పష్టం చేసింది. సంఘం డెయిరీలో ఆర్థిక అవకతవకలు, లావాదేవీల్లో తప్పుడు లెక్కలు చూపించటం ద్వారా వందల కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలు, విమర్శలతోపాటు కుంభకోణం జరిగినట్లు చెబుతోంది ఏసీబీ.

సంఘం డెయిరీ ఆషామాషీది ఏమీ కాదు.. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి.. 20 ఏళ్లుగా ధూళిపాళ్ల నరేంద్ర ఆ డెయిరీకి చైర్మన్ గా ఉన్నారు. అతని మనుషులే డైరెక్టర్లుగా, శాశ్వత సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ 20 ఏళ్లలో 20 వేల కోట్ల రూపాయల లావాదేవీలు సంఘం డెయిరీ నుంచి జరిగినట్లు సమాచారం.

సంఘం డెయిరీ అనేది 25 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటా.. కేంద్ర డెయిరీ డెవలప్ మెంట్ 70 శాతం వాటాతో ప్రారంభం అయ్యింది. పూర్తిగా ప్రభుత్వ డెయిరీ ఇది. ఇలా పెట్టిన వాటాలతోనే రైతుల నుంచి భూములు కొన్నారు. వారికి వాటా సైతం ఇచ్చారు. అలా ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి మొదటి చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలోని లొసుగులతో ప్రభుత్వ సంస్థను ప్రొడ్యూసర్ సంస్థ కింద మార్చేశారు. దాదాపు 20 ఏళ్లుగా ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉంటూ.. అతని మనుషులే సభ్యులుగా కొనసాగుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేని విధంగా.. సొంత కంపెనీగా మార్చేశారు.

రెండో విషయం ఏంటంటే.. సంఘం డెయిరీకి చెందిన 10 ఎకరాల భూమిని.. ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. సంఘం డెయిరీ నిధులతో దాన్ని నడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంఘం డెయిరీని.. అతని సొంత ఆస్తిగా భావించి.. తన తండ్రి పేరుతో నడుస్తున్న ట్రస్ట్ కు కోట్ల రూపాయల నిధులు మళ్లించటం మరో పెద్ద అవినీతి.

20 ఏళ్లుగా నరేంద్ర చైర్మన్ గా ఉన్నారు.. ఏడాదికి వెయ్యి కోట్ల టర్నోవర్.. అప్పట్లో తగ్గినా.. ఇప్పుడు పెరిగినా.. యావరేజ్ గా 20 వేల కోట్ల టర్నోవర్ జరిగితే.. దీనికి సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర చెప్పిందే లెక్క.. రాసిందే లెక్క అన్నట్లు ఉందంట.

సంఘం డెయిరీ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానిది అన్న విషయం ఎంత మందికి తెలుసండీ.. అలాంటి సంస్థ ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ సంస్థలా.. ధూళిపాళ్ల నరేంద్ర ఫ్యామిలీ స్థాపించిన సంస్థగా చిత్రీకరించటం ఎంత వరకు సబబు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు