9వ తరగతి వరకు స్కూల్స్ మూసివేత.. టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాయథం

cm jagan tirupati tour cancel

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి, స్కూల్స్, కాలేజీల నిర్వహణపై సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీ సోమవారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. విద్యాశాఖతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

పాఠశాలల్లో కరోనా వ్యాప్తి, పిల్లలకు వైరస్ ఎటాక్ అవుతుండటంతో.. ఒకటి నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మంగళవారం నుంచి.. అనగా ఏప్రిల్ 19వ తేదీ నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

పదో తరగతి విద్యార్థులకు తరగతులు యధావిధిగా జరుగుతాయని.. అన్ని స్కూల్స్, కాలేజీల్లో శానిటైజ్ చేయటం జరుగుతుందన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయటం వల్ల భవిష్యత్ లో కాంపిటీషన్ ఎగ్జామ్స్, పై తరగతులకు వెళ్లే సమయంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగిందని.. 9వ తరగతి వరకు మాత్రమే తరగతులు మూసివేయటం జరుగుతుందన్నారు.

ప్రతి విద్యార్థికి మూడు మాస్కులు ఇస్తున్నామని.. ప్రతిరోజు శానిటైజ్ చేయటం, నిరంతరం కరోనా పరీక్షలు చేయటం వల్ల వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు