యూ టర్న్ తీసుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్

యూ టర్న్ తీసుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేవలం ఆరు రోజుల ప్రక్రియ దగ్గర ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతున్నా.. ఇప్పుడు మాత్రం కరోనా వ్యాక్సిన్, కరోనా కేసులు అంటూ

ఇప్పుడు కరోనా పరిస్థితుల క్రమంలో.. కేసులు పెరుగుతున్న సందర్భంలో నామినేషన్ల దగ్గర ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు నిర్వహించటం సాధ్యం కాదు అంటున్నారు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటన చేయాలని ఎస్ఈసీ పరిధిలోని అంశం అని హైకోర్టు స్పష్టం చేసిన క్రమంలో.. దీనిపై స్పందించారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

కరోనా వ్యాక్సిన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించలేం అంటూ ప్రకటించారు. మార్చి నెలాఖరుతో పదవీ కాలం ముగుస్తుండటంతో.. వచ్చే వారు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

ఇక్కడే జనం అంతా డైలమాలో పడ్డారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ఉంది.. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని చెప్పినా వినకుండా కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఎంతో కీలకం అంటూ ధర్మసూత్రాలు వల్లించారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.. ఎన్నికలు నిర్వహించి తీరతాం.. మా అధికారాలు మాకు ఉన్నాయ్ అంటూ రాజ్యాంగం గురించి చాలా గొప్ప లెక్చర్స్ ఇచ్చారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

కేవలం ఆరు రోజుల ప్రక్రియ దగ్గర ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతున్నా.. ఇప్పుడు మాత్రం కరోనా వ్యాక్సిన్, కరోనా కేసులు అంటూ పరిషత్ ఎన్నికలను వాయిదా వేయటం ఏంటో జనానికి అర్థం కావటం లేదు. అప్పుడు దేశంలో బీహార్ లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా ఐదు రాష్ట్రాలు అయిన బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా కరోనాతో షెడ్యూల్ ఇవ్వటం కుదరదు అని చెప్పటం ఎవరికి అర్థం కావటం లేదు.

అప్పట్లో ప్రభుత్వం వ్యతిరేకించింది.. ఇప్పడు ప్రభుత్వం రెడీ అంటోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలకు సైతం హైకోర్టు ఓకే చెప్పటంతో.. కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలింది. వాస్తవంగా అయితే 25వ తేదీకి కొత్త షెడ్యూల్ ఇచ్చినా.. ఆయన పదవీ కాలం ముగిసే సమయానికి ప్రక్రియ ముగుస్తుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి అంతా తెలిసిన.. ప్రెస్ మీట్లలో లెక్చర్స్ ఇచ్చే కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని.. అప్పటి ప్రభుత్వ వాదనను.. ఇప్పుడు తాను వినిపించటం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు