ఏపీలో వ్యాపారస్తుల సెల్ఫ్ లాక్ డౌన్ : మధ్యాహ్నం నుంచి షాపులు క్లోజ్

self lockdown in andhrapradesh

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో.. ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో వర్తక, ఇతర వ్యాపారులు అందరూ.. సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు ఓపెన్ చేస్తామని వెల్లడించారు. మధ్యాహ్నం 2 నుంచి అన్ని షాపులు మూసేస్తామని.. ప్రజలు తమ అవసరాల కోసం ఉదయం పూట బయటకు రావాలని.. మధ్యాహ్నం తర్వాత షాపులు క్లోజ్ చేసి ఉంటాయని.. ప్రజలు అందరూ గమనించాలని పిలుపునిచ్చారు.

ప్రజల ఆరోగ్యం, సమాజ హితంతోపాటు తమ ఆరోగ్యం, మా కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఇదే విధంగా ఉంటుందని.. కరోనా కేసుల నమోదు ఆధారంగా మే నెలలో పూర్తి స్థాయిలో షాపులు తెరిచేది లేనిది తర్వాత ప్రకటిస్తామని వివరించారు వ్యాపారులు.

విజయనగరం జిల్లాలోని వ్యాపారు నిర్ణయానికి అనుగుణంగా.. ఏపీలోని మిగతా జిల్లాల వ్యాపారులు, వర్తక సంఘాలు ఆలోచనలో పడ్డాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో షాపులు మూసివేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయన్న ఆందోళన ఉంది. వ్యాపారం కంటే ప్రాణాలు ముఖ్యం కదా అనే ఉద్దేశంతో.. మిగతా జిల్లాల్లోని వ్యాపారులు సైతం సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు