సెమీ పోర్న్ వీడియోలతో రూ.250 కోట్లు టర్నోవర్.. రాజ్ కుంద్రా మాస్టర్ ప్లాన్

సెమీ పోర్న్ వీడియోలతో రూ.250 కోట్లు టర్నోవర్.. రాజ్ కుంద్రా మాస్టర్ ప్లాన్

సెమీ పోర్న్ వీడియోలతో రూ.250 కోట్లు టర్నోవర్.. రాజ్ కుంద్రా మాస్టర్ ప్లాన్

పోర్న్ అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో లీగల్.. ఇండియాలో మాత్రం సెమీ పోర్న్ వరకు ఓకే. కొన్ని యాప్స్ వీటి కోసం ప్రత్యేకంగా తయారయ్యాయి. హిందీలో మాత్రం పుట్టుకొచ్చిన నాలుగు యాప్స్ టర్నోవర్ అనూహ్యంగా పెరిగింది. లాక్ డౌన్ ముందు.. 100 కోట్ల మార్కెట్ టర్నోవర్ ఉన్న ఈ యాప్స్.. జస్ట్ ఏడాది కాలంలో వీటి టర్నోవర్ వెయ్యి కోట్లకు రీచ్ అయ్యింది. ఈ వెయ్యి కోట్ల ఆదాయం కేవలం నాలుగు యాప్స్ ద్వారానే జరగటం విశేషం.

ఇండియాలో సెమీ పోర్న్ యాప్స్ తయారీ, మార్కెటింగ్ అంతా గూగుల్, ఇండియా గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతున్నాయి. వెయ్యి కోట్ల మార్కెట్ కు కావాల్సిన కంటెంట్ కొరత తీవ్రంగా ఉంది. కొత్త కాన్సప్ట్ లు, కొత్త తారల సెర్చింగ్ అనేది ఛాలెంజ్ గా మారింది. ఇలాంటి టైంలోనే ఎంటర్ అయిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. తనకు బాలీవుడ్ లో ఉన్న సంబంధాలతో సెమీపోర్న్ మేకింగ్ ను టార్గెట్ చేశాడు. అనుకున్నట్లుగానే 250 కోట్ల రూపాయలకు టర్నోవర్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్ రచించాడు.

రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినప్పుడు.. అతని ఇంట్లో అక్షరాల 7 కోట్ల 50 లక్షల రూపాయల డబ్బు దొరికింది. ఇది సామాన్యమైన అమౌంట్ కాదు. ఇదంతా పోర్న్ మేకింగ్ కు సంబంధించిన లావాదేవీలదే అని గుర్తించారు పోలీసులు. హాట్ క్యాష్ ఏడున్నర కోట్లు అంటే.. రెండేళ్లుగా సెమీ పోర్న్ సీరిస్ లపై ఇంకెన్ని కోట్లు ఖర్చు చేశాడో అనేది పెద్ద టాపిక్ అయ్యింది.

హిందీలో నాలుగు పాపులర్ యాప్స్ ఉన్నా.. హాట్ షాట్స్ అనే ఓ కంపెనీతో రాజ్ కుంద్రా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఉన్న పరిచయాలు, చిన్న తారలు, నటీమనులనే టార్గెట్ చేసి ఈ వీడియో మేకింగ్ ను అత్యంత తక్కువ బడ్జెట్ లో తయారు చేసినట్లు తెలుస్తోంది. సెమీ పోర్న్ వెబ్ సిరీస్ తయారీకి అత్యధికంగా 25 లక్షల్లోనే కంప్లీట్ చేసి.. దాన్ని కోటి రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. రూపాయికి నాలుగు రూపాయల ప్రాపిట్ గైన్ చేసినట్లు సమాచారం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు