మరో గ్రహం నుంచి పడిందా లేక గ్రహాంతవాసులు వచ్చారా – ఆ దిమ్మె ఎలా వచ్చింది

ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఆ లోహపు దిమ్మె 12 అడుగుల ఎత్తు ఉండి...

అమెరికా దేశంలోని ఉటా ఎడారిలో సడెన్ గా ఒక దిమ్మె కనపడటంతో అధికారులు షాక్ అయ్యారు. రాత్రి పడుకుని ఉదయం లేచిన తర్వాత ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఔరా అని ఆశ్చర్యపోతాం.. అలాంటిది మనుషులు తిరగలేని ఎడారి ప్రాంతంలో.. లోహపు వస్తువు ఉండటం.. అది కూడా నిటారుగా నిలబడి ఉండటంత ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురి చేసింది.

ఉటా ఎడారిలో చుక్క నీళ్లు దొరకవు.. మనం నీళ్లు తీసుకెళ్లినా అవి ఆవిరి అయిపోతాయి. అంత హీట్ గా ఉంటుంది. ఇక్కడ మనుషులు తిరగటం అసాధ్యం. అటువంటి ఏరియాలో లోహపు వస్తువు ఎలా వచ్చింది.. ఎవరైనా పెట్టి వెళ్లారా.. ఏం అవసరం.. ఈ ఏడారిలోకి.. ఇంత దూరం ఎలా వచ్చారు అనేది ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఆ లోహపు దిమ్మె 12 అడుగుల ఎత్తు ఉండి.. మెరుస్తూ ఉంది.

ఉటా డిపార్ట్మెంట్ అఫ్ సేఫ్టీ అండ్ వైల్డ్లైఫ్ రిసోర్సెస్ వాళ్లు దీని ఎలా గుర్తించారు అంటే.. గొర్రెలు సంఖ్య లెక్కపెట్టటానికి ఎడారి ప్రాంతాల్లో హెలికాప్టర్ లో సర్వే చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ దిమ్మె కనబడింది. ఎవరైనా మనుషులు వచ్చి పాతరేమో అని చూస్తూ.. అలా వచ్చిన మనుషుల జాడ, ఆనవాళ్లు చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపించలేదు.

అది మనుషులు తిరిగే ఏరియా కాదు, ఏదైనా అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ఆలోచిస్తున్నారు. ఈ లోహపు దిమ్మె అంతరిక్షం నుంచి అదేనండీ మరో గ్రహం నుంచి పడిందనే వాదన ఉంది. లేక గ్రహాంతరవాసులు ఎవరైనా వచ్చారా.. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు ఏమైనా జరిగిందా అనే ప్రచారం ఎక్కువగా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు