శిరోముండనం బాధితుడు మిస్సింగ్ కేసు.. అంత ఓ నాటకం

గతేడాది తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ ఓ వ్యక్తికీ శిరోముండనం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇది పెద్ద దుమారమే లేపింది. సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో శిరోముండనం ఘటన జరగ్గా దీనిపై రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పదించింది. అయితే రెండు రోజుల క్రితం అతడు మిస్ అయినట్లుగా పోలీస్ స్టేషన్ లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయం కావడంతో కంగారు పడిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. శనివారం కాకినాడలో బైక్ రిపేర్ చేయిస్తుండగా పట్టుకున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఇలా పారిపోయినట్లు పోలీసుల విచారణలో శిరోముండనం బాధితుడు ఇండుగమల్లి ప్రసాద్‌ ఒప్పుకున్నాడు. వెళ్లేముందు ఇంట్లోనే సెల్ ఫోన్, బైక్ పెట్టి వెళ్లారని. ఎవరైనా అడిగితె ఏం చెప్పాలి అనే విషయం కూడా ఇంట్లోని వారికి చెప్పి వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

రెండు రోజుల క్రితం మిస్ అయిన ప్రసాద్, శనివారం దొరకడంతో పోలీసులు ఉపిరిపించుకున్నారు. ఇక అతడు స్నేహితుడు సందీప్ సాయంతో మల్లయ్యపేటలో దాక్కున్నాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కాకినాడలోని అచ్చంపేటలో సందీప్‌ బంధువుల ఇంటికి వెళ్లాడని వివరించారు. ప్రసాద్‌, అతని స్నేహితులు తీసుకెళ్లిన బైక్ రిపేర్ రావడంతో కాకినాడలోని అచ్చంపేట పోలీసు క్వార్టర్స్‌ దగ్గర బాగు చేసుకుంటుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచారు. కాగా తన భర్త కనిపించడం లేదని ప్రసాద్ భార్య గురువారం పోలీసులకు కంప్లైన్ట్ ఇచ్చింది. పోలీసుల కంప్లైంట్ అందుకున్న 24 గంటల్లోనే ప్రసాద్ ను పట్టుకున్నారు. అయితే ప్రసాద్ ఇలా చెయ్యడానికి గల కారణాలు తెలియరాలేదు. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శిరోముండనం బాధితుడు మిస్సింగ్ కేసు.. అంత ఓ నాటకం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు