దుబ్బాక రిజల్ట్ రిపీట్ అవుతుందా : కంచుకోట బద్దలైతే.. చినబాస్ సంగతి ఏంటీ..

etela rajender resign to paty issue for ktr

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి రావటం ఖాయం. అనుకున్నట్లుగానే.. షుగర్లీ ముందే చెప్పినట్లు.. ఆయన ఎమ్మెల్యే పదవితోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ ఆమోదం లాంఛనమే. ఈ క్రమంలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతున్నది. ఇటీవలే నాగార్జునసాగర్ లో తన సీటు నిలబెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

కరీంనగర్ జిల్లాలోని నాలుగు శాసనసభ స్థానాల్లో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి ఈటెల రాజేందర్ వరసగా గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక కన్ఫామ్ అయ్యింది. ఈ క్రమంలో.. మళ్లీ ఈటెల నిలబడతారా.. అతని తరపున భార్య లేదా కుమారుడు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తి. దీనికి ఇంకా కొంత సమయం ఉన్నా.. అసలు మేటర్ ఏంటంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి రాబోతున్నది.

ఈ నియోజకవర్గంలో ఈటెలకు వ్యక్తిగతంగా మంచి పలుకుబడి ఉంది. వ్యక్తిగత పరిచయాలు బాగా ఉన్నాయి. ఈటెల రాజేందర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కార్యకర్తలు, నేతలను కలిశారు. అభిప్రాయాలు తీసుకున్నారు. అందరూ ఏకపక్షంగా ఈటెల వెంట ఉన్నారు. ఈటెల గెలుపు కోసం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రజా, ఉద్యమ, కుల సంఘాలు గట్టిగానే పోరాటం చేయనున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం దుబ్బాక రిజల్ట్ ను రిపీట్ చేస్తే.. చినబాస్ సంగతి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అసలే కరీంనగర్ జిల్లా.. ఉద్యమాల పురిటిగడ్డ.. టీఆర్ఎస్ పార్టీకి ప్రాణం.. అలాంటి జిల్లాలోని.. టీఆర్ఎస్ కంచుకోట బద్దలు అయితే.. సీఎం రేసులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న.. కరీంనగర్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న చినబాస్ మైలేజ్ సంగతి ఏంటీ.. జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లవా ఏంటీ అనే టాపిక్ హాట్ అయ్యింది.

ఇప్పటికే ఇంట్లోని ఒకరిని ఓడించిన నిజామాబాద్ జిల్లా.. పరోక్షంగా చిన బాస్ కు కరీంనగర్ జిల్లాలో చెక్ పెట్టనున్నారా.. ఈటెల గెలుపు.. టీఆర్ఎస్ పార్టీలో అనేక మార్పులకు పునాది కాబోతుందనేది సుస్పష్టం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు