ఆయనది పెద్ద ఐరన్ లెగ్.. ఎటూ వెళ్లడు.. పార్టీని బతికించడు.. టీడీపీ నేతల్లో అంతర్గత చర్చ

somi reddy chandramoha reddy

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోవటం ముందే ఊహించినా.. గత ఎన్నికలతోపాటు పోల్చితే 7 శాతం ఓట్లు తగ్గటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ నేతలు. ఓటమి ఊహించిందే అయినా.. ఆ ఐరన్ లెగ్ వ్యక్తి ఇష్యూ అంతర్గతంగా బాగా చర్చకు దారి తీసింది. ఇంతకీ ఎవరు అతను.. అతనిపై ఇప్పుడెందుకు చర్చ అనేది చూద్దాం..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు తర్వాత అంత పాపులర్ అయ్యింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా పరిధిలోని నియోజకవర్గాలను దగ్గరుండి చూసుకున్నారు సోమిరెడ్డి. తిరుపతి లోక్ సభ పరిధిలో నెల్లూరు జిల్లా పరిధిలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అంతా తానై నడిపారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సవాళ్లు, ప్రతిసవాళ్లు ఈయనే చేశారు.

అయినా ఏ లాభం.. సోమిరెడ్డి బాధ్యత తీసుకున్న నాలుగు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సర్వేపల్లె 40,895 ఓట్లు వైసీపీ మెజార్టీ సాధిస్తే.. వెంకటగిరిలో 40 వేల 863, సూళ్ళూరుపేటలో 39వేల 885, గూడూరులో 36 వేల 492 ఓట్లు ఆధిక్యం తీసుకుంది అధికార పార్టీ.

ఈ నియోజకవర్గాల్లో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. సోమిరెడ్డి ఐరన్ లెగ్ అబ్బా.. ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయారు.. అది కూడా 10 నుంచి 15 వేల ఓట్లలోపు.. ఆయనది ఐరన్ లెగ్.. ఆయనే కాదు.. పార్టీనే ఓడిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు. సోమిరెడ్డి సీన్ లోకి వచ్చినప్పుడు అనుకున్నాం.. టీడీపీ ఓటమి ఖాయం అని.. మరీ ఇంత భారీ మెజార్టీతో ఓడిపోతాం అనుకోలేదు అంటున్నారు నేతలు.

నాలుగు ఎన్నికల్లో వరసగా ఓడిపోతూ వస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయినా పార్టీని వదిలిపెట్టదు.. పార్టీని బాగుచేయడు.. పార్టీని బతికించడు.. తాను గెలవడు అంటూ కామెంట్లు చేశారు టీడీపీ నేతలు. అదేమంటే సీనియర్ నేతను.. మంత్రిగా చేశాను.. అందరి కంటే నేనే తోపు అంటూ అన్నింటికీ ముందుకు వస్తాడు.. ముందే ఓడగొడతాడు అంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒక్కటి అంటే ఒక్క ఎమ్మెల్యే లేడు.. పదేళ్లుగా నానాటికీ తీసికట్టుగా మారింది దుస్థితి.. అయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపైనే భారం వేయటం అంటే చంద్రబాబు, లోకేష్ సాహసమే అని చెప్పాలి అంటున్నారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. సోమిరెడ్డిది ఐరన్ లెగ్ అనే స్థాయికి వచ్చేసింది పార్టీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు