పొలిటిక్స్ పై ఇంట్రస్ట్ చూపించిన సోనూ సుద్.. చంద్రబాబు విజన్ కు బ్రాండ్ అంబాసిడర్.. త్వరలోనే ఇద్దరి భేటీ

పొలిటిక్స్ పై ఇంట్రస్ట్ చూపించిన సోనూ సుద్.. చంద్రబాబు విజన్ కు బ్రాండ్ అంబాసిడర్.. త్వరలోనే ఇద్దరి భేటీ

పొలిటిక్స్ పై ఇంట్రస్ట్ చూపించిన సోనూ సుద్.. చంద్రబాబు విజన్ కు బ్రాండ్ అంబాసిడర్.. త్వరలోనే ఇద్దరి భేటీ

సోనుసూద్.. సినిమాల్లో విలన్ పాత్రలే చేసినా.. నిజ జీవితంతో రియల్ హీరో అనిపించుకున్నారు. ఎంతో మంది వీఐపీలకు సైతం అందని సాయాన్ని చేయటమే కాకుండా.. దేశంలోని.. విదేశాల్లోని ఎంతో మందికి సాయం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో పేదలను ఆదుకోవటంలో దేశవ్యాప్తంగా అతని మంచితనం వెలుగులోకి వచ్చింది. సొంత ఆస్తులను తాకట్టు పెట్టి సాయం చేస్తున్నారు. కొత్తగా సివిల్స్ చదివే పేద విద్యార్థులకు స్కాలర్స్ ఇస్తానని ప్రకటించారు కూడా. లేటెస్ట్ గా ఏపీలో పొలిటికల్ ఇష్యూలోకి ఎంట్రీ అయ్యి.. తన విధానం ఏంటో స్పష్టం చేశారు.

కరోనా అంశంపై చంద్రబాబుతో జూమ్ మీటింగ్ కు వచ్చిన సోను సూద్.. తన రోల్ మోడల్ చంద్రబాబు అని స్పష్టం చేశారు. అంతే కాకుండా.. చంద్రబాబు విజన్ ను కీర్తించారు.

చంద్రబాబును సోనూ సుద్ కీర్తించటంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. చంద్రబాబు ప్రత్యర్థి పార్టీలు అన్నీ ఇప్పుడు సోను సూద్ ను కౌంటర్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకు బీజేపీ వాళ్లు మాత్రమే సోనూ సుద్ ను కార్నర్ చేస్తూ వచ్చాయి.. వీళ్లకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జత అయ్యింది. అందరూ కలిసి సోనూ సుద్ ను పొలిటికల్ ఇష్యూలోకి లాగాయి అనేకంటే.. ఆయనే స్వయంగా ఎంట్రీ ఇచ్చారు అని చెప్పొచ్చు.

90 శాతం తెలుగు సినిమాల్లోనే నటిస్తున్న సోనూ సుద్ కు తెలుగు రాజకీయాలు తెలియంది కాదు.. ఏపీలోని రాజకీయం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం అంత కన్నా లేదు.

అన్నీ తెలిసి చంద్రబాబు విజన్ ను పొగడ్తలతో ముంచెత్తటం, రోల్ మోడల్ అని ప్రకటించటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఎక్కడో కాలుతుంది.

మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో నాగలి దున్నుతున్న ఫొటో చూసి.. రాత్రికి రాత్రి ట్రాక్టర్ అందజేశారు. ఆ అంశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు సోనూ సుద్.

ఏడాది కిత్రమే ఓ సాయంపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉంటుందో రుచి చూసిన సోను సూద్.. ఇప్పుడు చంద్రబాబు జూమ్ మీటింగ్ లోకి వచ్చి.. తెలుగుదేశం పార్టీని కీర్తించటం, చంద్రబాబు విజన్ ను ప్రశంసించటంతో.. ఆయన ఏపీ పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లే కనిపిస్తుంది. చంద్రబాబు విజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గానే ఉన్నట్లు అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు