సోనుసూద్ కు కరోనా పాజిటివ్ – 2 రోజుల క్రితమే ఆచార్య షూటింగ్

సోనుసూద్ కు కరోనా పాజిటివ్ - 2 రోజుల క్రితమే ఆచార్య షూటింగ్

sonusood tested corona positive
sonusood tested corona positive

సోనుసూద్ కు కరోనా పాజిటివ్ – 2 రోజుల క్రితమే ఆచార్య షూటింగ్

కరోనా బాధితులు వేలాది మందిని ఆదుకున్న నటుడు సోనుసూద్ కు కరోనా బారిన పడ్డాడు. ఏప్రిల్ 17వ తేదీ శనివారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు సోనుసూద్. వారం రోజులుగా తనతో ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. హోం క్వారంటైన్ లో ఉన్నానని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అభిమానులకు వెల్లడించారు.

లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడ్డానని.. ఈ ఉదయమే ఈ విషయం తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నానని వివరించారు.

త్వరలోనే కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని బయటకు వస్తానని.. అప్పటి వరకు ఎవరూ డిస్ట్రబ్ చేయొద్దని.. ఎవరూ ఫోన్లు చేయొద్దని సూచించారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నానని.. కుటుంబ సభ్యులు, అభిమానులు, దేవుడి అండదండలు ఉన్నాయని వెల్లడించారు.

రెండు రోజుల క్రితమే సోనుసూద్.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. వారంపాటు ఆయనపై సన్నివేశాలు చిత్రీకరించారు. సోనుసూద్ కు కరోనా అని తెలిసిన వెంటనే.. ఆచార్య షూటింగ్ సిబ్బందిలోనూ ఆందోళన నెలకొంది. పరీక్షలు చేయించుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు