నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న స్పీకర్ తమ్మినేని – చంద్రబాబు

నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న స్పీకర్ తమ్మినేని - చంద్రబాబు.. మీరు పద్దతిగా మాట్లాడటం నేర్చుకోండి అంటూ స్పీకర్ వైపు వేలు ఎత్తి చూపిస్తూ మాట్లాడారు చంద్రబాబు..

ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం హద్దులు దాటి.. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వచ్చేసింది. అధికార – విపక్ష సభ్యుల మధ్య జరిగే రొటీన్ కు భిన్నంగా.. ఈసారి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం – టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల ఫైర్ నడిచింది.
సభను ఎలా నడపాలో మీరు చెబుతారా.. పదే పదే ఎందుకు సభను అడ్డుకుంటున్నారు.. అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి.. అందరికీ అవకాశం ఇస్తాం అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశం స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్ చేశారు.

మాట్లాడే పద్దతి నేర్చుకోవాలి అంటూ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. అసహనంతో చేతిలోని పేపర్ విసిరేశారు స్పీకర్ తమ్మినేని
ముందు మీరు పద్దతిగా మాట్లాడటం నేర్చుకోండి అంటూ స్పీకర్ వైపు వేలు ఎత్తి చూపిస్తూ మాట్లాడారు చంద్రబాబు.

దీంతో స్పీకర్ తమ్మినేని మరింత ఘాటుగా స్పందించారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు ఇద్దరూ

నీ దగ్గర నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబుతో స్పీకర్ అన్నారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణం, లబ్దిదారులకు కేటాయింపు అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్ – చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు