మందుకొట్టే దమ్ముందా : డిసెంబర్ 31 రాత్రి.. 200 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్

3 వేల మంది పోలీసుల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అందరూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు ఎటువంటి అనుమతులు లేవని..

Special drunk and drive in 200 Areas on hyderabad city
Special drunk and drive in 200 Areas on hyderabad city

డిసెంబర్ 31వ తేదీ అంటేనే పార్టీలు, ఫుల్ జోష్. మందుకొట్టి రోడ్డెక్కితే కిక్ దిగే వరకు బలాదూర్లు తిరగటం.. హ్యాపీ న్యూఇయర్ చెప్పుకుని ఎప్పుడో తెల్లవారుజామున ఇంటికి రావటం కుర్రోళ్లకు కామన్. ఈసారి 2021కి వెల్ కం చెబుతూ.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మందు కొట్టాలంటే దమ్ము ఉండాలి.. రోడ్డెక్కాలంటే భయపడాలి. అవును.. పోలీస్ శాఖ వార్నింగ్స్ ఇలాగే ఉన్నాయి.

కాదూకూడదు అనుకుని రోడ్డెక్కారో కొత్త ఏడాదిలో ఊచలు లెక్కపెట్టటం ఖాయం.. మీ బండి సీజ్ చేసి.. నడిచి వెళ్లేలా చేయటం పక్కా.. ఎందుకంటే పోలీస్ అధికారి చెప్పిన లెక్కలు అలా ఉన్నాయి.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సైబరాబాద్ సిటీ పరిధిలోనే 200 ప్రాంతాల్లో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు.

200 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం 3 వేల మంది పోలీసుల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అందరూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు ఎటువంటి అనుమతులు లేవని… బహిరంగంగా గుమిగూడినా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేస్తే కేసులు నమోదు చేస్తారు.

బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ లపై ప్రత్యేక నిఘాతోపాటు పరిమితికి మించి, కోవిడ్ నిబంధనలు పాటించకుండా బార్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేయటంతోపాటు సీజ్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు మూసి వేస్తారు.

ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాళ్ళు టికెట్ చూపించి వెళ్ళాలి.. ఔటర్ రింగ్ రోడ్డుపై చిన్న వాహనాలకు అనుమతి లేదు. పెద్ద వాహనాలకు అనుమతి ఉంది.

తాగి వెహికిల్స్ డ్రైవ్ చేస్తూ.. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే కేసులు నమోదు చేయటంతోపాటు రోడ్డు ప్రమాదాలు చేస్తే 304 కింద కేసులు నమోదు చేసి పదేళ్ల జైల్ శిక్ష పడేలా చూస్తారు.

ఇన్ని టెన్షన్స్ మధ్య తాగటం అవసరమా చెప్పండి.. 2020లో చేసుకున్నాం ఏమైందీ కరోనా వచ్చి అందరం ఇళ్లల్లో ఉన్నాం.. ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఇంట్లో పడుకోండి. లేదంటే ఓ బీరో.. ఓ క్వార్టరో ఇంటికి తెచ్చుకుని తాగండి. ఇంట్లో పెళ్లాంకి భయపడేవాళ్లు ముసుగుతన్ని పడుకోండి.. అనవసరంగా పోలీసులకు చిక్కి.. బండి సీజ్ అయ్యి.. ఎందుకీ బాధలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు