3 వేల మంది పోలీసులతో రోడ్డపై ఎందుకు.. వెయ్యి మందితో బార్ల దగ్గర పెట్టొచ్చు కదా.. డ్రంక్ అండ్ డ్రైవ్

కే రోజు అత్యధికంగా 900కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఆ తర్వాత కౌన్సెలింగ్, కోర్టులు, జైలు ఇదంతా అవసరమా అంటున్నారు... కరోనా తర్వాత పెంచిన

Special drunk and driven in hyderabad in december 31
Special drunk and driven in hyderabad in december 31

డిసెంబర్ 31 వచ్చింది అంటే చాలు.. రాత్రంతా పార్టీలు, రోడ్లపై హంగామా.. ఈసారి మాత్రం పార్టీ గీర్టీ ఏమీ లేదు బావా.. ఇంటికెళ్లి పడుకుందాం అంటున్నారు. స్నేహితుడికో.. కొలీగ్ కో.. ఫోన్ చేసి సాయంత్రం ఏంటి పార్టీ అని ప్రశ్నిస్తే చాలు.. ఇదే మాట వస్తుంది.

పోలీసులు బీభత్సంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారంట కదా.. తాగినందుకే ఓ బొక్క అనుకుంటే.. మళ్లీ ఈ పోలీసోళ్ల టెన్షన్.. ఈ గోల అంతా ఎందుకు బావా.. ఇంటికెళ్లి హాయిగా పడుకుందాం అంటున్నారు హైదరాబాదీలు.

వారం రోజులుగా న్యూ ఇయర్ వేడుకులపైనే కాకుండా హైదరాబాద్ సిటీ మొత్తం గల్లీలతో సహా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తోంది. ఒకే రోజు అత్యధికంగా 900కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఆ తర్వాత కౌన్సెలింగ్, కోర్టులు, జైలు ఇదంతా అవసరమా అంటున్నారు.

కరోనా తర్వాత పెంచిన ధరలతో సస్తున్నాం.. బారులో ఇద్దరు కూర్చుంటే 15 వందలు ఎగిరిపోతున్నాయి.. గతంలో అయితే 800 రూపాయలు అయ్యేది.. కరోనా తర్వాత బారు బిల్లు డబుల్ అయ్యింది.. ఇదే దండగ అనుకుంటుంటే.. ఈ పోలీస్ టెన్షన్ అనే ఫీలింగ్ కు వచ్చారు. తాగిన తర్వాత క్యాబ్ కు వెళ్దాం అంటే అదో 500 రూపాయలు…

3 వేల మందితో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లు రోడ్లపై ఎందుకు.. హైదరాబాద్ సిటీ మొత్తం తిప్పికొట్టినా వెయ్యికి మించి బార్లు, పబ్స్, క్లబ్బులు ఉండవు. ఒక్కో బారు, పబ్, క్లబ్ ముందు ఒక్కో పోలీస్ ను పెట్టి.. చెక్ చేస్తే సరిపోతుంది కదా.. రోడ్లపై హడావిడి, ట్రాఫిక్ జాం ఎందుకు అంటున్నారు. ఎవరు వచ్చినా బార్లు, పబ్బులు, క్లబ్బుల నుంచే కదా రోడ్లపైకి రావాల్సింది. అక్కడే చెక్ చేస్తే సరిపోతుంది కదా అని ఇళ్లల్లోని సగటు మధ్య తరగతి లేడీస్ ఫీలింగ్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు