30 ఏళ్లలో మగతనం ఉన్నా లేనట్లే.. అబ్బాయి పుడితే ఏడవాల్సిందే..

30 ఏళ్లలో మగతనం ఉన్నా లేనట్లే.. అబ్బాయి పుడితే ఏడవాల్సిందే.. పరీక్షలు చేయించిన తర్వాతే ఒకే అనే రోజులు కచ్చితంగా వస్తాయి.. చూస్తూ ఉండండి..

Sperm Counts Continue to Fall for mens
Sperm Counts Continue to Fall for mens

నేను మగాడిని అని విర్రవీగే రోజులు ఇక ఉండవు.. నువ్వు మగాడివే.. ఏదీ నీ మగతనం అంటే బిక్కముఖం వేసే రోజులు రాబోతున్నాయి.. దీనికి ఎంతో కాలం పట్టదు.. జస్ట్ మరో 30 ఏళ్లు.. అంటే 2040 నాటికి ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా భారతదేశంలో ఈ పరిణామాలు వేగంగా రాబోతున్నాయి. అబ్బాయి పుట్టాడు అని సంబరపడే లోపు.. అయ్యో అబ్బాయి ఎందుకు పుట్టాడు అని ఏడిచే రోజులు రాబోతున్నాయి.. అమ్మతోడు ఇది జనం.

ప్రపంచవ్యాప్తంగా అంతా ప్లాస్టిక్ మయం అయ్యింది. వండే వంట కూడా ప్లాస్టిక్ వస్తువులతోనే.. నాలుగు గింజల బియ్యం ఓ ఔల్ లో వేసి ఓవెన్ లో పెడితే అన్నం అయిపోతుంది.. అంతెందుకు రెడీమేడ్ ఫుడ్ వచ్చేసింది. ఇడ్లీ పిండి నుంచి చపాతీ, పరోటా, అన్నం, కూరలు అన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్. వేడి నీళ్లు ఆ డబ్బాలో పోస్తే చాలు తినటానికి రెడీ అయిపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న ఈ విధానమే పురుష ప్రపంచానికి శాపంగా మారుతోంది.

1973లో.. మన అమ్ముమ్మ, నానమ్మలు ఒక్కొక్కరు.. పది మంది పిల్లలను కనేవారు.. ఆ తర్వాత 1980లో ముగ్గురు, నలుగురు పిల్లలకు వచ్చారు.. 1990లో ఇద్దరు పిల్లలు ముద్దు అన్నారు.. 2010 నాటికి ఒక్క పిల్లోడు ఉంటే చాలు అంటున్నారు.. 2020 నాటికి పిల్లలెందుకు అనాధలను తెచ్చుకుని పెంచుకుంటాం అంటున్నారు. మారుతున్న కాలంతోపాటు.. రాబోయే 30 ఏళ్లలో అంటే 2040 నాటికి మగాళ్లలోని మగతనం చచ్చిపోనుంది. పిల్లలు కావాలని ప్రయత్నించినా.. అబ్బే తుస్సు అంటోంది.

1973లో మగాడి వీర్యంలో 100 శాతంగా ఉన్న కణాలు.. 2020 సంవత్సరంలో 40 శాతం పడిపోయాయి. అంటే మగాడి మగతనం 40 శాతం తగ్గిపోయింది. అందుకే అందరూ ఫెర్టిలిటీలు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్లాస్టిక్ తోపాటు సెల్ ఫోన్ రేడియేషన్, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం, కాలుష్యం, ఆహారపు అలవాట్లతో 2040 నాటికి మగాడికి వీర్యం వస్తుంది కానీ.. అందులో కణాలు మాత్రం ఉండవు అన్నమాట.. మగాడే కానీ పిల్లలను పుట్టించే మగతనం సున్నాగా ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న లేటెస్ట్ ఇష్యూ..

అమ్మాయి పుడితే ఏడుస్తున్న జనం.. 2040 నాటికి మాత్రం అబ్బాయి పుడితే ఏడ్చే రోజులు వస్తాయి.. ఇప్పటికే పిల్లలను పుట్టించే ఆస్పత్రులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. 2040 నాటికి ఊరికి ఒకటి వచ్చినా ఆశ్చర్యం లేదు.

సో.. మగాడిగా ఉండటం కాదు ముఖ్యం.. మగతనంతో ఉండటం ముఖ్యం అని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. మగాడిని పెళ్లి చేసుకోవాలంటే.. పరీక్షలు చేయించిన తర్వాతే ఒకే అనే రోజులు కచ్చితంగా వస్తాయి.. చూస్తూ ఉండండి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు