కరోనా వ్యాక్సిన్ 92 శాతం పని చేస్తుంది – రష్యా ప్రకటనపై ప్రపంచ దేశాలు ఆసక్తి

వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని.. ఎలాంటి అపోహలు వద్దని రష్యాకు చెందిన రిసెర్చ్ అనలిస్ట్ కిరిల్ ప్రకటించారు.

corona vaccine in india

కరోనా వైరస్ కు విరుగుడుగా.. రాకుండా ప్రపంచంలోనే ఫస్ట్ టైం రష్యా తీసుకొచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని.. 92 శాతం ఫలితాలు వచ్చాయని ఆ దేశం సంచలన ప్రకటన చేసింది.
స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్ రన్ ను యూఏఈ, బెలారస్, వెలిజులా దేశాల్లో మూడు దశల్లో విజయవంతంగా పరీక్షించాయని.. 92 శాతం ఫలితాలు వచ్చాయని ప్రకటించింది
నాలుగు దేశాల్లో 10 వేల మంది ప్రయోగాలు చేసి పరీక్షించటం జరిగిందని ప్రకటించింది రష్యా దేశం

వ్యాక్సిన్ ఇచ్చిన 21 రోజుల తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. సమర్థవంతంగా పని చేసిందని వెల్లడించింది
ఇందుకు సంబంధించిన డేటా అంతా బహిర్గతం చేయటానికి సిద్ధంగా ఉన్నామని.. వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని.. ఎలాంటి అపోహలు వద్దని రష్యాకు చెందిన రిసెర్చ్ అనలిస్ట్ కిరిల్ ప్రకటించారు.
2020 ఆగస్ట్ లోనే వ్యాక్సిన్ తీసుకొచ్చినట్లు రష్యా ప్రకటించినప్పటికీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి రాలేదు. చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేశారు.

మరిన్ని ప్రయోగాల కోసం మరో 6 నెలల సమయం తీసుకున్న రష్యా.. అందుకు సంబంధించి డేటాను వెల్లడించటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను 92 శాతం ఎదుర్కొంటుందని గట్టిగా చెబుతోంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు