చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి.. రోడ్డుపైనే బైఠాయింపు.. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు

చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి.. రోడ్డుపైనే బైఠాయింపు.. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు

tdp
tdp

చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి.. రోడ్డుపైనే బైఠాయింపు.. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు

తిరుపతిలో ప్రచారంలో ఉన్న చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఓ యువకుడు రాయితో దాడి చేశాడు. ఈ రాయి దాడిలో చంద్రబాబు సమీపంలోని ఓ మహిళ, ఓ యువకుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో షాక్ అయిన చంద్రబాబు… రౌడీయిజం నశించాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు చంద్రబాబు.

చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి ఘటన తెలిసిన వెంటనే పోలీసులు భారీ ఎత్తున స్పాట్ కు వచ్చారు. రాయి విసిరిన దుండగుడిని పట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం రథంపై పడిన రాయిని చూపించిన చంద్రబాబు.. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెడ్ ప్లస్ సెక్యూరిటీలో చంద్రబాబుపై దాడి జరగటంపై ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. ఇది కావాలని చేసిన కుట్ర అంటూ మండిపడుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు