వెయ్యి ఫోన్లకు, 20 కెమెరాలకు దొరకలేదా రాయి : అంత నీట్ గా ఉందా రాయి : రాయి దాడిలో ఈ ప్రశ్నలే కీలకం

వెయ్యి ఫోన్లకు 20 కెమెరాలకు దొరకలేదా రాయి : అంత నీట్ గా ఉందా రాయి : రాయి దాడిలో ఈ ప్రశ్నలే కీలకం

చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని గాంధీ రోడ్డులో రోడ్ షో నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆయనపై రాయి దాడి జరిగింది. ఏప్రిల్ 12వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనపై.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు పెట్టారు.. విచారణ మొదలైంది.. అయితే అతి సామాన్యమైన ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉంది పోలీసులు.

చంద్రబాబుపై రాయి దాడి చేసి వ్యక్తి ఎవరు.. ఎందుకు చేశాడు.. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది ప్రధానంగా పోలీసులు తేల్చాల్సింది అంశం.

మరో కీలకమైన పాయింట్ ఏంటీ అంటే.. చంద్రబాబు రోడ్ షో సమయంలో ఆ ప్రాంతంలో 2 వేల మంది వరకు ఉన్నారంట.. 20 నుంచి 25 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు కవర్ చేస్తున్నారు. మరో వెయ్యి మంది వరకు సెల్ ఫోన్ లో కెమెరాలతో బాబు రోడ్ షోను కవర్ చేస్తున్నారు. ఇన్ని ఫోన్లలో.. ఇన్ని కెమెరాలు ఉన్నా.. రాయి వచ్చిన దిశ.. ఎటు నుంచి వచ్చింది అనేది ఒక్కడా నమోదు కాలేదంట. ఏ ఛానల్ వాళ్లకు కూడా విసిరిన రాయిని దొరక్కపోవటం విశేషం.. మెరుపు వేగం కంటే ఇంకా వేగంగా ఈ రాయి చంద్రబాబు వైపు వచ్చి ఉండాలి అంటున్నారు.

చంద్రబాబు చూపించిన రాయి.. చాలా చాలా నీట్ గా ఉంది. ఎంత నీట్ గా ఉంది అంటే రాయికి శానిటైజర్ చేశారా ఏంటీ అనేంతగా.. అంటే ఇదేదో ముందే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాయిని తన జేబులో పెట్టుకోవాలి.. లేదా ఏదైనా బ్యాగ్ లో పెట్టుకుని వచ్చి ఉండాలి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాయి దాడిలో గాయపడిన వారిని చూపించిన చంద్రబాబు.. వాళ్లకు తగిలిన దెబ్బలను చూపించలేదు. రాయి వాళ్లకు తగిలిందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాయి దెబ్బ తిన్నవారు చెప్పేవారిని విచారిస్తే అసలు విషయాలు బయటకు రానున్నాయి. ఎటు వైపు నిల్చొని ఉన్నారు.. రాయి ఎక్కడ తగిలింది అనే విషయంపై క్లారిటీ వస్తే.. ఆ దిశ నుంచి రాయి వచ్చినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చి ఆ దిశగా విచారణ ముందుకు తీసుకెళ్లటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.

రాయి దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేవరకు ప్రచారానికి వచ్చిన వారికి సైతం తెలియలేదంట. రోడ్ షోలో పాల్గొన్న వారి నుంచి పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరిస్తే.. రాయి దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేవరకు మాకు తెలియదంటూ చెప్పటం విశేషం. అంటే ఆయన వాహనాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ రాయి విసిరారు అనేది స్పష్టం అవుతుంది.

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసు నమోదు అయ్యింది అక్కడే కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు