అచ్చెన్నాయుడిపై స్టింగ్ ఆపరేషన్.. వీడియో తీసిన వ్యక్తి అతనేనా.. మిగతా వీడియోలో ఏముందీ..

అచ్చెన్నాయుడిపై స్టింగ్ ఆపరేషన్.. వీడియో తీసిన వ్యక్తి అతనేనా.. మిగతా వీడియోలో ఏముందీ..

అచ్చెన్నాయుడిపై స్టింగ్ ఆపరేషన్.. వీడియో తీసిన వ్యక్తి అతనేనా.. మిగతా వీడియోలో ఏముందీ..

లోకేష్ బాగుంటే.. పద్దతిగా ఉంటే.. పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొస్తుంది.. 30 ఏళ్లు సర్వీస్ చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదు.. వాడుకుని వదిలేస్తున్నారు.. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెద్దాయనతో మాట్లాడితే చూస్తాను.. చేస్తాను అన్నారు.. లోకేష్ గాడి దగ్గరకు వెళితే.. అక్కడ కూర్చో అంటున్నాడు. దగ్గరకు కూడా రానీవ్వటం లేదు. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తటం లేదు.. ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉందీ అంటే.. చేసుకోండి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెబితే అయిపోయేదానికి ఎన్ని సంవత్సరాలుగా తిప్పించుకుంటారు సార్…

అచ్చెన్నాయుడితో మాట్లాడించిన వ్యక్తే బాధితుడు అంటున్నారు. ఇది పక్కా ప్లాన్ గా స్టింగ్ ఆపరేషన్ జరిగింది. అచ్చెన్నాయుడితో మాట్లాడుతున్న వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని.. అతని పేరు వెంకటరావు అని సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని.. అందులో టీడీపీ ప్రముఖ వ్యక్తులు అందరూ పార్టనర్స్ అని తెలుస్తోంది.

ఎవరి వాటా వాళ్లు తీసుకుని వెళ్లిపోగా.. వెంకటరావుకు సంబంధించి ఆరు కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వలేదు. ఈ ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది రాజగోపాల్, రమేశ్ అని బాధితుడు వెంకట్రావు నోటి నుంచి వచ్చిన మాటలతో స్పష్టం అవుతుంది.

చంద్రబాబు, లోకేష్ ఒక మాట చెబితే పని అయిపోతుందని.. డబ్బులు ఇచ్చేస్తారు అని బాధితుడు అచ్చెన్నాయుడు దగ్గర తన గోడు వెళ్లబోతున్నాడు. ఈ సందర్భంలో పార్టీ పరిస్థితి ప్రస్తావనకు రాగా.. లోకేష్ సక్రమంగా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటూ అచ్చెన్నాయుడు అనటం సంచలనంగా మారింది. ఏప్రిల్ 17వ తేదీతో తిరుపతి ఉప ఎన్నిక అయిపోతుంది.. అందరం ఫ్రీ అయిపోతాం.. ఆ తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు అనటం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.

రియల్ ఎస్టేట్ గొడవల కారణంగా అచ్చెన్నాయుడిపై స్టింగ్ ఆపరేషన్ చేశారనే టాక్ నడుస్తుంది. బాధితుడి లేదా బాధితుడి వెంక ఉన్న వారు దీన్ని రికార్డ్ చేశారని తేలిపోయింది.

మొత్తం 21 నిమిషాల వీడియో ఉందని సమాచారం. అందులో ప్రస్తుతం ఐదు నిమిషాల వీడియో బయటకు వచ్చింది.. ఇంకా 16 నిమిషాల వీడియో రిలీజ్ కావాల్సి ఉంది. అందులో ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు ఉంటాయో చూడాలి.

అచ్చెన్నాయుడిపై స్టింగ్ ఆపరేషన్ వీడియో తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. కీలకమైన సమయంలో పార్టీకి మరింత డ్యామేజ్ అంటున్నారు నేతలు. కొందరు అయితే ఉన్న మాటే కదా.. వాస్తవం ఒప్పుకున్నారు.. అంగీకరిస్తున్నారు అచ్చెన్నాయుడు అంటున్నారు.

Latest Update :అచ్చెన్నాయుడిపై స్టింగ్ ఆపరేషన్.. వీడియో తీసిన వ్యక్తి అతనేనా.. మిగతా వీడియోలో ఏముందీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు