విదేశాలకు పారిపోతున్న సుజనాచౌదరిని అడ్డుకున్న పోలీసులు

రూ.8 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకున్నాయి. సుజనా తాకట్లు పెట్టిన ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని

బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోతున్న క్రమంలో మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజానాచౌదరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నవంబర్ 13వ తేదీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో ఆయన్ను అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల కుంభకోణంలో సుజనాచౌదరిపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లటానికి ప్రయత్నించగా.. ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో.. అమెరికా వెళ్లకుండా అడ్డుకోవటంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ సుజనాచౌదరి. లుక్ ఔట్ నోటీసులు రద్దు చేయాలని కోరారు.
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322 కోట్ల అప్పుతోపాటు వడ్డీతో కలిపి రూ.400 కోట్లకు చెల్లించాల్సి ఉంది. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో.. తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది బ్యాంకు.

సుజనా చౌదరి 102 సూట్ కేసు కంపెనీలు సృష్టించి.. బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులను సొంత అవసరాలకు తరలించారు. ఇవి సర్క్యులర్‌ ట్రేడింగ్, బుక్‌ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలు చేసినట్లు ఈడీ గుర్తించింది. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకున్నాయి. సుజనా తాకట్లు పెట్టిన ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు