పేదలకు అండగా.. కరోనా రోగులకు ఆక్సిజన్ భరోసా ఇచ్చిన సునీతా లక్ష్మారెడ్డి

పేదలకు అండగా.. కరోనా రోగులకు ఆక్సిజన్ భరోసా ఇచ్చిన సునీతా లక్ష్మారెడ్డి

పేదలకు అండగా.. కరోనా రోగులకు ఆక్సిజన్ భరోసా ఇచ్చిన సునీతా లక్ష్మారెడ్డి

కరోనా బాధితులు అందులోనూ పేదలకు అండగా మేమున్నామని భరోసా ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి. తన భర్త పేరుతో నడుస్తున్న వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను పంపిణీ చేశారు. శివంపేట ప్రభుత్వ ఆస్పత్రికి ఒకటి, నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి నాలుగు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను స్వయంగా అందజేశారు. కరోనా రోగులకు అత్యవసరంగా అందించే ఆక్సిజన్ కొరతను ఈ కాన్సన్ ట్రేటర్లు తీరుస్తాయని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద రోగులకు అండగా నిలవటం సంతోషంగా ఉందన్నారు.

కరోనా బాధితుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని.. ప్రభుత్వ పరంగానే కాకుండా లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవసరం అయిన సాయం అందజేస్తున్నట్లు వివరించారు. ఆక్సిజన్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు వల్ల ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం అయ్యిందన్నారు.

కరోనా విపత్కర సమయంలో.. అత్యవసర వైద్యం కోసం అవసరం అయిన ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను అందించటం ఆనందంగా ఉందన్నారు సునీతా లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు