దేశం అల్లకల్లోలంగా ఉంటే పట్టించుకోరా.. దేశం అంటే మనీ కాదు.. మనుషులు..

దేశం అల్లకల్లోలంగా ఉంటే పట్టించుకోరా.. దేశం అంటే మనీ కాదు.. మనుషులు..

supreme court notice to central government on corona
supreme court notice to central government on corona

దేశం అల్లకల్లోలంగా ఉంటే పట్టించుకోరా.. దేశం అంటే మనీ కాదు.. మనుషులు..

కరోనాతో దేశం అల్లకల్లోలంగా ఉంటే చోద్యం చూస్తారా.. ఏం చర్యలు తీసుకుంటున్నారు.. కరోనా బాధితులను ఆదుకోవటంపై ఎందుకీ నిర్లక్ష్యం అంటూ ఏప్రిల్ 22వ తేదీ గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనాపై ఏం చర్యలు తీసుకుంటున్నారు.. మందుల కొరతను ఎలా అధిగమిస్తున్నారు.. ఆక్సిజన్ కొరత పరిష్కారానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది అనే విషయాలపై ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.

ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తారా ఏంటీ.. ప్రజలు లేకపోతే దేశం ఎక్కడుండి అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దేశం అంటే మనీ కాదని.. మనుషులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దేశవ్యాప్తంగా పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటే చోద్యం చూసినట్లు చూస్తున్నారని.. 24 గంటల్లోనే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది వెంటనే చెప్పాలని ఆదేశించింది.

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో.. కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్నాయని.. ఇంత సీరియస్ గా పరిస్థితులు వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి.. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎన్నికల బిజీలో ఉన్నారు.. పశ్చిమబెంగాల్ ఎన్నికల ర్యాలీల్లో వ్యూహాలు పన్నుతున్నారు.. ఇది జనానికి తెలిసిన సత్యం కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు