టి20 కెప్టెన్ గా కోహ్లీని తొలగించాలి.. రోహిత్ కు ఇవ్వాలి

టి20 కెప్టెన్ గా కోహ్లీని తొలగించాలి.. రోహిత్ కు ఇవ్వాలి

టీం ఇండియా అన్ని ఫార్మేట్లకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ లో కోహ్లీ నాయకత్వం వచ్చిన రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీం సెమిస్ కూడా రాకుండా వైదొలిగింది. దింతో కోహ్లీపై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. కోహ్లీని టి 20 కెప్టెన్సీ నుంచి తొలగించాలని, రోహిత్ శర్మను కెప్టెన్ గా పెట్టాలని తెలిపారు.

రోహిత్ కు టి 20 ఫార్మాట్ పై మంచి పట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. బెంగళూరులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టును విజయపధంలో నడిపించడంలో కోహ్లీ విఫలమయ్యారని మండిపడుతున్నారు. కోహ్లీని తప్పించి రోహిత్ కు కెప్టెన్సీ ఇస్తే ఇండియా జట్టు మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆలా లేకుండా బెంగళూరు మాదిరే ఇండియా జట్టుకోటా ఓటములను మూటగట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు