దొంగతనానికి వచ్చి. నలుగురు మృతి.. గ్రామంలో విషాదం

దొంగతనానికి వచ్చి. నలుగురు మృతి.. గ్రామంలో విషాదం

దొంగతనానికి వచ్చి నలుగురు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, తమిళనాడుకు చెందిన ఎర్రచెందనం స్మగ్లర్లు సోమవారం తెల్లవారుజామున సుమోలో దుంగలను తీసుకోని తమిళనాడుకు బయలుదేరారు. కడప ఎయిర్పోర్ట్ వద్దకు రాగానే టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టారు. దింతో సుమోలో మంటలు చెలరేగాయి.

భారీ శబ్దం వచ్చింది. సుమో వెనుక వస్తున్నా మరో కారుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమో డోర్లు త్వరగా తెరుచుకోకపోవడంతో మంటల్లో కాలి నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డీజిల్ ట్యాంక్ కు తగలడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

టిప్పర్ లోని డీజల్ ట్యాంక్ ను సుమో ఢీ కొట్టడంతో భారీశబ్దంతో పేలుడు సంభవించి వాహనాలు దగ్దమయినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఇక కడప, చిత్తూరు సరిహద్దుల్లో ఎర్రచెందనం స్మగ్లింగ్ నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజు స్మగ్లర్లు ఎర్ర చెందానని దొంగిలిస్తూనే ఉన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు