కోర్టుల్లో పోరాడతాం.. ఎన్నికలు బహిష్కరణ – చంద్రబాబు

కోర్టుల్లో పోరాడతాం.. ఎన్నికలు బహిష్కరణ - చంద్రబాబు మనోవేదన

చంద్రబాబు స్వయంగా ప్రకటించటం చూసి షాక్ అయ్యారు అభ్యర్థులు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. ఎన్నికల్లో పోటీ చేసేది లేదని సంచలన నిర్ణయం ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల కమిషన్ వైఖరికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

> అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగించటం తగదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తాం

> ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదలపై కోర్టుల్లో పోరాడతాం.. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళతాం

> ప్రజాక్షేత్రం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం.. కోర్టుల్లోనే పోరాడతాం : చంద్రబాబు

> నా 40 ఏళ్ల చరిత్రలో ఇదే కఠిన నిర్ణయం అని ప్రకటించిన చంద్రబాబు

జెడ్పీ ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రభుత్వం అరాచకాలు చేసింది. బెదిరింపులు, దౌర్జన్యాలు చేసింది.

> మళ్లీ కొత్త ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. ఎస్ఈసీ వినిపించుకోకుండా షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపిన చంద్రబాబు

> ప్రజాక్షేత్రంలో పోరాటం చేయం.. జెడ్పీ ఎన్నికలపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం ద్వారా విజయం సాధిస్తామని ప్రకటించారు చంద్రబాబు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు