మీవాడికే లేనిది మీకెందుకు – గ్రామాల్లో కార్యకర్తల పరిస్థితి

మీవాడికే లేనిది మీకెందుకు - గ్రామాల్లో కార్యకర్తల పరిస్థితి ప్రశాంతంగా ఉండండి.. మాకు ఓటు వేయండి.. ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి

TDP cadre angry on chandrababu decision by zptc elections
TDP cadre angry on chandrababu decision by zptc elections

మీవాడికే లేనిది మీకెందుకు – గ్రామాల్లో కార్యకర్తల పరిస్థితి

చూడు బాబూ.. మీవాడికే లేదు.. వదిలేశాడు.. మీకెందుకు దురద.. కందకు లేనిది కత్తిపీటకు అన్నట్లు.. అనవసరంగా గొడవలు, రాద్దాంతం, కోపాలు, తాపాలు, పట్టుదలలు, పట్టింపులు ఎందుకు.. హాయిగా వచ్చి మా పార్టీలో చేరండి.. పోటీలో లేరు కాబట్టి మాకు ఓటు వేయండి.. అదీ ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండండి.. మీ పార్టీ అధినేతే పోటీలో లేం అని చెబుతుంటే.. మీరెందుకు చింపుకుంటారు.. ఇదీ గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలు, జెడ్పీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల పరిస్థితి.

జెడ్పీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని.. టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరంటూ స్వయంగా ప్రకటించారు అధినేత చంద్రబాబు. ఈ పరిణామాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ దుస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్షం అనే ఫీలింగ్ అయినా ఉండేది.. ఇప్పుడు అది కూడా లేదు. కనీసం భయం కూడా లేదు. ఓట్లు చీల్చుతారు.. ఓట్లు పోతాయ్ అనే భయమే లేదు అధికారపార్టీకి. ప్రతిపక్షమే పోటీ చేయటం లేదు అంటే.. వార్ వన్ సైడ్ అయినప్పుడు.. గ్రామాల్లో ఇంత కంటే భిన్నంగా ఏముంటుందీ టీడీపీ పార్టీ పరిస్థితి.

జెడ్పీ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించినా.. కొన్ని చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తాం అంటున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సిట్యువేషన్ ఎదురవుతుంది అధికార పార్టీ నేతలు, అభ్యర్థుల నుంచి. కత్తికి లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు.. మీ వాడికే లేని దురద.. మీరెందుకు పూసుకుంటారయ్యా.. ప్రశాంతంగా ఉండండి.. మాకు ఓటు వేయండి.. ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అవును.. పార్టీ అధినేత పోటీకి నో.. నో.. అంటే క్యాడర్ దుస్థితి ఇంతకు మించి భిన్నంగా ఉంటుంది అని ఊహించలేం కదా.. ఏపీలో టీడీపీ ఎన్నికలను బహిష్కరించి కార్యకర్తలను అడ్డంగా ముంచేసిందనే టాక్ వినిపిస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు