పరారీలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ.. ఫోన్ స్విచ్ఛాఫ్

devineni uma

అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమ.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఏప్రిల్ 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం.. విజయవాడలోని ఆయన ఇంటికి సీఐడీ అధికారులు చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరంటూ సమాధానం వచ్చింది. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది.

సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు దేవినేని ఉమ. అయితే ఇది ఒరిజినల్ కాదని.. మార్ఫింగ్ చేశారంటూ కంప్లయింట్ ఇచ్చారు నారాయణరెడ్డి అనే వ్యక్తి.

15, 19 తేదీల్లో విచారణ రావాలని రెండు సార్లు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవటంతో ఏకంగా మంగళవారం ఇంటికి వచ్చారు సీఐడీ అధికారులు. ఏప్రిల్ 10వ తేదీన ఉమపై కర్నూలులో ఎఫ్ఐఆర్ నమోదైంది.

465, 468, 469, 470, 471, 505, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సీఐడీ అధికారులు విచారణ కోసం ఇంటికి వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ పరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు