తెలుగు తమ్ముళ్లలో తెగింపు : ఆ ఛానెళ్లను, పత్రికలను నమ్ముకుంటే మునిగిపోతాం

టీడీపీకి న్యూస్ ఛానల్ కావాలంట - తెలుగు తమ్ముళ్లలో తెగింపు

ఇక ఎంత మాత్రం లాభం లేదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 పత్రికలు, ఛానళ్లను నమ్ముకుంటే ఇంకా మునిగిపోతాం.. వీళ్లు వీళ్ల డిబేట్స్ చూడలేకపోతున్నాం.. పార్టీని ఇంకా నాశనం చేసేట్టు ఉన్నారు.. అర్జంట్ గా తెలుగుదేశం పార్టీకి ఓ సొంత ఛానల్ ఉండాలి అంటూ టీడీపీ కార్యకర్తలు ఓపెన్ డిమాండ్ చేయటమే కాదు.. ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం సంచలనంగా మారింది.

జెడ్పీ ఎన్నికల బహిష్కరణ క్రమంలో.. తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలు డిమాండ్లు వినిపిస్తున్నారు. గతంలో కీర్తనలు, పొగడ్తల వరకు పరిమితం అయ్యే తెలుగు తమ్ముళ్లు.. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా మన ఆక్రోశం, పార్టీ నాశనం అవుతుంది.. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. వాస్తవాన్ని గ్రహించండి అంటూ కామెంట్లు పెట్టటం ఆ పార్టీలో మార్పు సంకేతం అయిన తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉన్న వారు అంటున్నారు.

లేటెస్ట్ డిమాండ్ ఏంటంటే.. టీడీపీకి సాక్షి పత్రిక, న్యూస్ ఛానల్, సోషల్ మీడియా వింగ్ తరహాలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీకి సొంతంగా ఛానల్ ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని.. ఇప్పటికే వాటికి ఎల్లో మీడియా అని.. టీడీపీ అనుకూల మీడియా అని ముద్ర ఉందని.. వాటి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. రేటింగ్ తగ్గినా.. పత్రిక సర్క్యులేషన్ తగ్గినా, రీడర్స్ తగ్గిపోతున్నా.. ఆయా పత్రికలు, ఛానళ్లు రూటు మార్చినా మార్చుతాయి.. అప్పుడు అసలుకే మోసం వస్తుంది.. పార్టీని పూర్తి ప్రక్షాళన చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కనీసం ఛానల్ అయినా పెట్టాలని డిమాండ్ చేశారు తెలుగు తమ్ముళ్లు.

జెడ్పీ ఎన్నికల బహిష్కరణ తర్వాత తెలుగు తమ్ముళ్లు తెగించేశారు. ప్రత్యర్థిపై కంటే.. సొంత పార్టీలో వ్యవహారాలపైనే దృష్టి పెట్టారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది.. ఇప్పుడు ప్రక్షాళన చేయకపోతే ఇంకెప్పటికీ పార్టీ బతకదు అనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లు తెగించేశారు..

మార్పు మంచికే కదా.. ఆల్ ద బెస్ట్ తమ్ముళ్లు.. నిజమైన టీడీపీ అభిమానులు కోరుకుంటుంది కూడా ఇదే…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు