ఈ ఒక్క ప్రశ్నతో హైకోర్టులో ఖంగుతిన్న టీడీపీ లాయర్లు

ఈ ఒక్క ప్రశ్నతో హైకోర్టులో ఖంగుతిన్న టీడీపీ లాయర్లు

ఏపీలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీరుపై విస్తృత ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్నది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ దాఖలు చేసిన పిటీషన్ పై వాదనల సమయంలో.. ఓ ఆసక్తికరమైన ప్రశ్న హైకోర్టులో వచ్చిందని.. ఆ సమయంలో టీడీపీ తరపున లాయర్ నీళ్లు నమిలారని బయట టాక్.

రాజ్యాంగ విరుద్ధంగా షెడ్యూల్ విడుదల చేశారని.. బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని టీడీపీ తరపున వర్ల రామయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఎస్ఈసీ తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించారని.. అలాంటప్పుడు అరాచకాలు జరిగాయని.. దౌర్జన్యాలు జరిగాయని ఎలా చెబుతారని.. ఎన్నికలను బహిష్కరిస్తున్న విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ పాయింట్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందంట. నోటిఫికేషన్, ఏకగ్రీవాల విషయంలో గతంలోనే తీర్పు స్పష్టంగా ఉంది. ఇప్పటి షెడ్యూల్ కొనసాగింపుగానే ఉంది.. అయినా కూడా మీరు అసలు పోటీలోనే లేరు కదా.. స్వచ్ఛంధంగా ఎన్నికల నుంచి తప్పుకున్నారు కదా.. అలాంటప్పుడు మీరు లేవనెత్తుతున్న అంశాలకు ప్రాథమిక ఆధారాలు, అభ్యంతరాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే ప్రశ్న వచ్చిందంట.

అసలు పోటీలోనే లేనప్పుడు.. పార్టీ అభ్యర్థులు బరిలో ఉండటం లేదని.. ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించుకోవాలని స్వయంగా టీడీపీ ప్రకటించినప్పుడు.. ఇంకెక్కడి దౌర్జన్యాలు, అరాచకాలు అనే పాయింట్ పై వాదనలు వినిపించలేక నీళ్లు నమిలారంట టీడీపీ తరపు లాయర్లు.

పిల్లే నచ్చనప్పుడు.. ఇంకెక్కడి ముహూర్తాలు, లాంఛనాలు, కళ్యాణ మండపం అనే బేసిక్ క్వశ్చన్ మిస్ అయ్యి.. టీడీపీ పిటీషన్ దాఖలు చేసినట్లు ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు విషయం తెలిసిన నెటిజన్లు.. నిజమే కదా.. పోటీలోనే లేనప్పుడు.. వివాదం ఎక్కడిది..

See also : నెల తర్వాత జెడ్పీ ఎన్నికలు పెడితే గెలుస్తామా.. నిజం చెప్పండి.. తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు