నల్లపూస అయిన అచ్చెన్నాయుడు.. 10 రోజులుగా ట్టిట్టర్ లోనే కూతలు.. బయటకు రావటం లేదు ఎందుకో..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బాగా తగ్గిపోయారు.. ఏప్రిల్ 17వ తేదీ పోలింగ్ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. మొక్కు చెల్లించుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని కడిగేశారు. అంతే.. 10 రోజులుగా నల్లపూస అయ్యారు అచ్చెన్నాయుడు. ఈ పది రోజుల్లో ఒకే ఒక్క ట్విట్ వేశారు.. అది కూడా నారా లోకేష్ పిలుపునకు సంబంధించి.. రీ ట్విట్ చేసి నేను ఉన్నాను అని నిరూపించుకున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయనో లేక పార్టీ లేదు బొక్కా లేదు అనవసరంగా ఈ టైంలో చించుకోవటం ఎందుకు అనుకున్నారో ఏమో.. పెద్దగా కనిపించటం లేదు. నారా లోకేష్, చంద్రబాబు రెగ్యులర్ ట్విట్టర్, జూమ్ ద్వారా అయినా కనిపిస్తూ ఉన్నా.. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం నల్లపూస అయ్యారు అంటున్నారు నేతలు, కార్యకర్తలు.

కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో కార్యకర్తలకు దైర్యం చెప్పటం.. సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా జనంలోకి వెళ్లటం వంటి యాక్షన్ ప్లాన్ చేయాల్సిన అచ్చెన్నాయుడు.. నిమ్మకుండి పోయారు అనే టాక్ తెచ్చుకుంటున్నారు. పరీక్షల అంశాన్ని చంద్రబాబు, లోకేష్ ఎత్తుకున్నట్లు అచ్చెన్నాయుడు ఎత్తుకోలేదని.. అస్సలు మాట్లాడకపోతే బాగుండదనే ఉద్దేశంతో.. 24వ తేదీన ఓ ట్విట్ వేసినట్లు వేసి మాయం అయ్యారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన అంశంలోనూ అచ్చెన్నాయుడు స్పందించిన తీరు చాలా చప్పగా ఉందనే టాక్ టీడీపీలోనే వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడు దూకుడు చూపిస్తారా లేదా అనేది చూడాలి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు