చంద్రబాబులో ఊహించని మార్పు – ఇకనైనా భజన చేయడం ఆపాలని సీనియర్లకు హితవు

చంద్రబాబులో ఊహించని మార్పు - ఇకనైనా భజన చేయడం ఆపాలని సీనియర్లకు హితవు

వారం రోజులు తిరుపతిలో చంద్రబాబు ప్రచారం

చంద్రబాబులో ఊహించని మార్పు – ఇకనైనా భజన చేయడం ఆపాలని సీనియర్లకు హితవు

మార్పు రావాలి.. మార్పు రావాలి అంటూ టీడీపీ కార్యకర్తలు, నేతలు పదేపదే అంటున్నారు.. ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు మాటల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. 40 ఏళ్ల హిస్టరీలో.. 14 ఏళ్ల అధికారంలో కనిపించని అసహనం.. ఆవేశం.. ఉగ్రరూపం ఇప్పుడు చూపిస్తున్నారు చంద్రబాబు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న చంద్రబాబు.. శని, ఆదివారాల్లో నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సి వ్యూహం, ప్రచారం సరళిపై నేతలు, కార్యకర్తలను మాట్లాడాలని సూచించారు. అక్కడ ఉన్న అందరూ చంద్రబాబుకు జయహో అంటూ కీర్తించటం, పొగడ్తలతో ముంచెత్తటం చేశారు. అద్భుతం.. అదరహో.. ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఉంది.. గెలుపు ఖాయం అంటూ ఆకాశానికెత్తారంట. సుమారు గంటపాటు నేతలు, కార్యకర్తల మాటలు విన్న చంద్రబాబు.. ఒక్కసారి ఉగ్రరూపం చూపించారంట.

వాట్ ఈజ్ థిస్.. ఇంకా ఎన్నాళ్లు ఇలా భజన చేస్తారు.. వెళ్లి జనంలో తిరగండి.. ఓట్లు వేయించండి.. ఇక నుంచి అయినా భజన చేయటం ఆపేయాల.. ఇంకా ఎన్నాళ్లు ఇలా మోసం చేస్తారు.. మోసం చేసుకుంటారు.. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైందో చూశాం కదా.. ఇంకా ఎందుకు నాకు భజన చేస్తూ ఉంటారు.. మీ భజన చేయాల్సింది నాకు కాదు.. ప్రజలకు.. ఓట్లు వేసిది వాళ్లు.. వాళ్లకు చేయండి భజన అంటూ ఉగ్రరూపం చూపించారంట.

అధినేత సీరియస్ కావటంతో షాక్ అయిన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారంట. ఓ రెండు నిమిషాలు మౌనం పాటించిన చంద్రబాబు.. ఆ తర్వాత కూల్ చేయటం మొదలుపెట్టారంట. ఇప్పటి వరకు జరిగింది ఒకటి.. ఇక నుంచి మరో లెక్క.. జెండా మోసినోళ్లకే పార్టీ పదవులు.. కార్యకర్తలకే నా ప్రయార్టీ.. మీరు లేకపోతే పార్టీ లేదు.. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా నా దగ్గర నేరుగా రావొచ్చు.. ఇక నేతలు ఎవరూ గ్రూపు రాజకీయాలు చేయొద్దు.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.. వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అంటూ కార్యకర్తలను పొగుడుతూ.. నేతలకు చురకలు అంటించారంట.

పార్టీలో మార్పు రావాలి.. పార్టీలో ప్రక్షాళన జరగాలి అని కోరుకుంటున్న వారు.. ముందుగా చంద్రబాబులో వచ్చిన మార్పు చూసి.. నిజంగా మార్పు మొదలైందా అని అనుకుంటున్నారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు