జనం సొమ్ము రూ.248 కోట్లు అప్పనంగా తిన్న గంటా – టీడీపీ హయాంలో మంత్రి

ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో ఉన్న గంటా.. 248 కోట్ల బ్యాంక్ అప్పు మాత్రం కట్టకపోవటం...

గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వారు ఉండరు.. రాజకీయంగా పలుకుబడి కలిగిన బడా పారిశ్రామికవేత్త కూడా. వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు.. అలాంటి అతను ప్రజల సొమ్మును అప్పనంగా తిని.. వాటిని ఇప్పుడు ఎగ్గొడుతున్నారు.. కోటి, రెండు కోట్లు కాదు.. ఏకంగా 248 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకుని.. ఇప్పుడు ఎగ్గొట్టారు.

ఇండియన్‌ బ్యాంకుకు అప్పు ఎగవేతతో.. అప్పు కింద పెట్టిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను ఇప్పుడు వేలం వేస్తున్నారు.
వడ్డీతో సహా మొత్తం అప్పు రూ.248.03 కోట్లు అయ్యింది. ఆ డబ్బు చెల్లించకపోవడంతో బ్యాంకు ప్రత్యూష కంపెనీ కింద పెట్టిన ఆస్తులను వేలం వేస్తోంది.
విశాఖ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను నవంబర్ 25వ తేదీన వేలం వేసేందుకు సిద్ధమైంది.
2006 అక్టోబర్ 4న అప్పు చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాకపోవటంతో 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తులు స్వాధీనం చేసుకున్న సమయంలో గంటా శ్రీనివాసరావు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో ఉన్న గంటా.. 248 కోట్ల బ్యాంక్ అప్పు మాత్రం కట్టకపోవటం విశేషం.

బ్యాంక్ అప్పు కోసం పెట్టిన ఆస్తులు వేలం వేస్తే 248 కోట్లు వస్తాయా అంటే అదీ కష్టం అంటున్నారు బ్యాంక్ అధికారులు. 100 కోట్ల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉందా అనేది డౌట్ అంట. అంటే ఈ లెక్కన మరో 148 కోట్ల రూపాయలు జనం సొమ్ము అప్పనంగా తన్నట్లే కదా.. మళ్లీ ఈయనగారు ప్రజాసేవ అంటూ నీతులు చెబుతారా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు